Bade Miyan Chote Miyan teaser:బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బడే మియాన్ చోటే మియాన్’ . ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుకుంది. కాగా, మూవీ మేకర్స్ బుధవారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ రోల్లో నటించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో మొదలైన ఈ టీజర్.. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ గన్స్ పట్టుకోని ఫూల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.