Rashmi Gautam : సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే అందాల తారల్లో యాంకర్ రష్మీ ఒకరు. చిన్నితెరపై జబర్దస్త్ వినోదం పంచుతూనే ఆన్ లైన్ మాధ్యమాలపై హవా నడిపిస్తుంటుంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలోనే తాజా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Rashmi Gautam తన గ్లామర్ షో హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసిన రష్మీ.. ఆ పిక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ట్రెండీ ఫొటోస్ చూసి నెటిజన్లు రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది రష్మీ.
సినీ, టీవీ కెరీర్ మాత్రమే కాదు యాంకర్ రష్మీలో మరో కోణం కూడా దాగి ఉందని మనందరికీ తెలుసు. జంతు ప్రేమికురాలిగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. సామజిక స్పృహతో రష్మీ ముందుకెళ్తూ ఉంటుంది.
కాగా.. గత కొన్ని నెలలుగా యాంకర్ రష్మీ పెళ్లి ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ పెళ్లి బాజా ఎప్పుడు మోగుతుందని అంతా వెయిట్ చేస్తున్నారు.
సుడిగాలి సుధీర్ తో యాంకర్ రష్మీ సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తుందనేది ఎప్పటినుంచో వింటున్న వార్త. ఈ ఇష్యూపై ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పుకున్నారు. ఆన్ స్క్రీన్ పై వీళ్ళ పెళ్లి కూడా జరగడంతో నిజ జీవితంలో సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు.
రీసెంట్ గా జరిగిన ఓ షోలో తనకు కాబోయే భర్త గురించి చెప్పి ఆశ్చర్య పర్చింది రష్మీ గౌతమ్. తనకు కాబోయే వాడు.. చెప్పిందే చేయాలని, చేసిందే చెప్పాలని అంటూ ఓపెన్ అయింది రష్మీ.