Tollywood Heroes : తెలుగు హీరోలు కూడా బాగానే మారిపోతున్నారు. చాలా వరకు ఏ ట్రెండ్ అయినా సరే సినిమా స్టార్ల నుంచే స్టార్ట్ అవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మన తెలుగు హీరోలు కూడా బాలీవుడ్ హీరోల రేంజ్ లో కాకపోయినా.. వారు కూడా కొందరు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అందులో కొందరు సక్సెస్ ఫుల్ గా కాపురాలు చేసుకుంటే మరికొందరు మాత్రం మొదటి భార్యతో విడాకలు తీసుకుని రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇందులో చాలా మందే ఉన్నారు. కాకపోతే కొందరు రెండో పెళ్లితో ఆగకుండా మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవరో చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్…
Tollywood Heroes : సీనియర్ ఎన్టీఆర్ కు మొదటి భార్య పేరు బసవతారకం. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే పిల్లలు పుట్టిపెద్దయి వారికి పెళ్లిలు కూడా చేసిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య చనిపోయారు. అదే సమయంలో రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తిని కొన్ని రోజులు ఒంటరి తనాన్ని అనుభవించారు సీనియర్ ఎన్టీఆర్. ఆ సమయంలోనే ఆయనకు లక్ష్మీ పార్వతితో పరిచయం కాస్తా రెండో పెళ్లికి దారి దీసింది. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.
అక్కినేని నాగార్జున…
నాగార్జున కూడా అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకున్నాడు. అయితే వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు పడ్డాడు. మొదట ఆయనకు దగ్గుబాటి రామానాయుడి కుమార్తె అయిన లక్ష్మీతో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ నాగచైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
మంచు మనోజ్…
మంచు మనోజ్ సినిమాల పరంగా పెద్ద స్టార్ కాలేకపోయాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడ్డాడు. మొదట ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చేశాడు. ఇక ఏడాది క్రితం ఆయన మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. మౌనికకు ఓ కొడుకు ఉన్నా కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు మనోజ్.
పవన్ కల్యాణ్…
పవన్ కల్యాణ్ పైన తెలిపిన వారిలా కాకుండా ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట విజయవాడకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత రేణూ దేశాయ్ తో డేటింగ్ చేసి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా విడిపోయి ఇప్పుడు అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నాడు.
మోహన్ బాబు…
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మంచు మోహన్ బాబు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యకు మంచు విష్ణు, లక్ష్మీ పుట్టారు. ఆ తర్వాత ఆమె చనిపోవడంతో ఆమె చెల్లెలినే రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ మంచు మనోజ్ పుట్టాడు. వీరందరూ కలిసే ఉంటున్నారు.
ALSO READ-
Konidela Upasana : మా ఇంట్లో ఇద్దరు పద్మవిభూషణ్ గ్రహీతలు.. ఆసక్తికర విషయాన్ని షేర్ చేసిన ఉపాసన…!