Mukya Gamanika: అల్లు అర్జున్ కజిన్ అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయిన విరాన్ ముత్తంశెట్టి ముఖ్య గమనిక సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Mukya Gamanika:క్రైం ఇన్వెస్టిగేటివ్ కథలను ఆడియెన్స్ ఆహరిస్తుంటారు. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరిస్తే బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్టే. తాజాగా వేణు మురళీధర్. వి. ఇలాంటి కథనే ‘ముఖ్య గమనిక’ (Mukya Gamanika) పేరుతో తెరకెక్కించారు.. ఇందులో అల్లు అర్జున్ కజిన్ అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయిన విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి బజ్ తో రిలీజ్ అయింది. మరి ఈ క్రైం థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.
కథ: విరాన్(విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఊహించని విధంగా అతని తండ్రి హత్యకు గురవుతాడు. దీంతో తండ్రి ఉద్యోగం విరాన్ కి వస్తుంది. అయితే విరాన్ తండ్రి మాత్రమే కాదు ఇంకా చాలా మంది పోలీసులు ఊహించని విధంగా హత్యకి గురవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి? చివరికి విరాన్ ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
హీరో విరాన్ మంచి సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. నటుడిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇది క్రైం థ్రిల్లర్ మూవీ కావడంతో ఇన్వెస్టిగేషన్ కోణంలో బాగానే చేశాడు. హీరోయిన్ లావణ్య సాహుకారకి తన పాత్రకి న్యాయం చేసింది. ఆర్.జె.రోల్ చేసిన నటుడు, అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి బాగా నటించారు. వీరిద్దరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది.
దర్శకుడు వేణు మురళీధర్.వి తీసుకున్న కథ, కథనం చాలా కాంటెంపరరీగా ఉండటంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఒక క్రైం థ్రిల్లర్ కు ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. దర్శకుడు మెప్పించే క్రైం థ్రిల్లర్ తీసి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. రెండు విభిన్న క్రైం ఎలిమెంట్స్ ను ఒకే స్టోరీలో చెప్పి.. మెప్పించారు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా అనిపించింది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు.
also read-Tollywood Heroines : హీరోలను లెక్కచేసే ప్రసక్తే లేదు అంటున్న టాలీవుడ్ హీరోయిన్స్…!