12th fail : విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్’. గతేడాది అక్టోబర్ 7న చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్నది.
12th fail : విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్’. గతేడాది అక్టోబర్ 7న చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్నది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా హిందీ వర్షన్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తెలుగులో చూద్దామనుకున్న వారి ఎదురుచూపులుకు నేటితో తెరపడింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా తెలుగు, తమిళ్ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ + హాట్‌స్టార్‌లో మంగళవారం ఉదయం నుంచి తెలుగులో ప్రసారమవుతుతున్నది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో దీనిని తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమాగా ఇది రికార్డ్‌కెక్కింది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్ సాధించింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.
also read-Heroines as Politicians In Movies : రాజకీయంలోకి తెలుగు హీరోయిన్స్ – అందంతో కాదు నటనతో..!
Brahmanandam : లగ్జరీ ఇల్లు, పొలాలు, కార్లు.. బ్రహ్మానందం ఆస్తుల విలవ ఎంతో తెలుసా..?