taapsee : తెలుగు హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆమె ప్రస్తుతం తెలుగులో పూర్తిగా సినిమాలను చేయడం ఆపేసింది. హిందీలో ఎక్కువగా నటిస్తోంది. ఈ భామ తాజాగా డంకీలో నటించి మెప్పించింది. అది అలా ఉంటే తాప్సీ ఓ వ్యక్తితో 10 ఏళ్లుగా డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
taapsee : తెలుగు హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆమె ప్రస్తుతం తెలుగులో పూర్తిగా సినిమాలను చేయడం ఆపేసింది. హిందీలో ఎక్కువగా నటిస్తోంది. ఈ భామ తాజాగా డంకీలో నటించి మెప్పించింది. అది అలా ఉంటే గత పదేళ్లుగా బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే..
ఇక అది అలా ఉంటే.. తాప్సీ పన్ను తన చిరకాల ప్రియుడు మిథియాస్ బోయ్ని ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే మ్యారేజ్ చాలా సీక్రెట్‌గా ఉంచింది తాప్సీ.. కాగా ఎట్టకేలకు తాను వివాహం చేసుకున్నట్లు ధృవీకరించింది తాప్సీ. తన పెళ్లి తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. వివాహం చేసుకున్నట్లు ధృవీకరించింది.
అయితే మ్యారేజీ ఫోటోలను మాత్రం తన అభిమానులతో పంచుకోవడం ఇష్టం లేదని పేర్కోంది. కొన్ని విషయాలను పబ్లి్క్గా పంచుకోవడం ఇష్టం లేదని.. ఎందుకంటే అది ఎలా వెళ్తుందో అని ఆందోళన చెందడం స్టార్ట్ చేస్తాను. అందుకే తాను ఎలాంటి ఫోటోలను కానీ, వీడియోలను కానీ పంచుకోలేదని తెలిపింది.
ఇక తాప్సీ, మథియాస్ మొదటిసారిగా 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో కలుసుకున్నారు. ఇక అక్కడి నుండి వారి మధ్య స్నేహం ఏర్పడి చివరికి ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లితో ముగిసింది.
మథియాస్‌తో ప్రేమలో పడటానికి ముందు తాప్సీ కొంతమందితో డేటింగ్ చేసిందట.. ఈ క్రమంలో ఆమె కొన్ని కప్పలకు ముద్దులు ఇచ్చినట్లు తెలిపింది. అయితే మథియాస్ బో తన అసలైన ప్రిన్స్ అని.. ముద్దుపై నటి షాకింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది..
తాప్సీ తెలుగులో ఘుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు ఆమె హిందీలో కూడాఅ అదరగొట్టింది. తాప్సీ హిందీలో సినిమా 2013లో చష్మే బద్దూర్‌తో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవిస్తోంది.
అతను (మథియాస్) పరిణతి చెందిన వ్యక్తి అంటూ.. తెలిపింది. తాను పదేళ్లుగా మథియాస్‌తో డేటింగ్ చేస్తున్నానని తాప్సీ అంగీకరించింది. నేను నా గురించి చాలా నిజాయితీగా ఉన్నాను, నా సంబంధాన్ని నేను దాచుకోలేదు అని తాప్సీ చెప్పింది.
మథియాస్ని కలవడానికి ముందు తాను కొంతమందితో డేటింగ్ చేశానని నటి తాప్సీ అంగీకరించింది. మథియాస్‌తో డేటింగ్ చేయడానికి ముందు తాను కొన్ని కప్పలను ముద్దుపెట్టుకున్నానని తాప్సీ చెప్పింది, ఈ మాటలు విని అభిమానులు షాక్ అయ్యారు.
తాప్సీ మొదట తెలుగు సినిమాల్లోనే నటించింది. ‘ఝుమ్మంది నాదం’ ఆమె తొలి మూవీ. ఆ తర్వాత మంచు విష్ణుతో వస్తాడు నా రాజు, రవితేజతో వీర, ప్రభాస్‌తో డార్లింగ్, జీవాతో వచ్చాడు గెలిచాడు, గోపిచంద్‌తో మొగుడు, వెంకటేష్‌తో షాడో వంటి సినిమాల్లో నటించి, మెప్పించింది.-ఇక తాప్సీ నటించిన మరో హిందీ సినిమా డంకీ.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. షారుఖ్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు.
ALSO READ-chiranjeevi : చిరంజీవితో అంజలి అదిరిపోయే మాస్ బీట్.. విశ్వంభరలో అసలు ట్విస్ట్ అక్కడే..!