Bajaj Pulsar N250 Launch : దేశీయ బైక్ తయారీ కంపెనీ బజాజ్ బుధవారం ఇండియాలో 2024 మోడల్ పల్సర్ ఎన్250 బైక్‌ను లాంఛ్ చేసింది. దీనితో అనేక సరికొత్త ఫీచర్లను పొందుపరిచింది.
రూ.851 మాత్రమే!
2024 Bajaj Pulsar N250 Price : బజాజ్ కంపెనీ ఈ నయా పల్సర్ ఎన్250 ధరను రూ.1,50,829 (ఎక్స్-షోరూం-దిల్లీ)గా నిర్ణయించింది. ఈ ధర ప్రీవియస్-జనరేషన్ బైక్ కంటే కేవలం రూ.851 మాత్రమే ఎక్కువ కావడం విశేషం.
2024 Bajaj Pulsar N250 Features :
- బజాజ్ కంపెనీ ఈ 2024 మోడల్ బజాబ్ పల్సర్ ఎన్250 బైక్‌ను కొత్త కలర్ ఆప్షన్లతో; ఇన్వర్టెడ్ ఫోర్క్, న్యూ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా పలు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది.
- ఈ నయా బజాజ్ బైక్‌కు 37mm ఇన్వర్టెడ్ ఫోర్క్‌ను జోడించారు. దీని వల్ల బైక్‌ను మరింత సులువుగా హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది. బజాజ్ కంపెనీ ఇది వరకే 2023 మోడల్ పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్160 బైక్స్ల్లో ఈ అప్డేట్ను తీసుకువచ్చింది.
- బజాజ్ కంపెనీ పల్సర్ ఎన్ఎస్200లో ఉన్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను, ఇప్పుడు పల్సర్ ఎన్250లోనూ పొందుపరిచింది. ఈ ఎల్సీడీ యూనిట్ – బైక్ స్పీడ్, టాకోమీటర్ రీడింగ్స్, ఫ్యూయెల్ లెవెల్, మైలేజ్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ రీడింగ్‌లు సహా, డీటీఈ లాంటి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ను కూడా చూపిస్తుంది.
- కాల్ ఫెసిలిటీ : ఈ న్యూ-జనరేషన్ పల్సర్ ఎన్250 బైక్‌కు స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకుని కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందవచ్చు. అంతేకాదు కాల్స్ యాక్సెప్ట్/ రిజెక్ట్ చేసుకోవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా చేసుకోవచ్చు. 250సీసీ బైక్ సెగ్మెంట్లో ఇంత మంచి ఫీచర్లు ఉన్న బైక్ ఇదే కావడం గమనార్హం.
- ఎడమ వైపు ఉన్న స్విచ్ గేర్‌ను కూడా అప్డేట్ చేసి, కొత్త బటన్‌ను పొందుపరిచారు. దీని ద్వారా రైడర్ కన్సోల్‌ను నావిగేట్ చేసుకోవచ్చు.
- అయితే దీనిలో ప్రీవియస్ జనరేషన్ బైక్‌ల్లో ఉన్న ట్యాంక్ మౌంటెడ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అలాగే కనసాగించారు.
- ఈ నయా బజాజ్ పల్సర్ ఎన్250 బైక్‌లో మొదటిసారిగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, 3 ఏబీఎస్ (ABS) మోడ్‌లను పొందుపరిచారు. రోడ్, రెయిన్, ఆన్/ఆఫ్ రోడ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఏబీఎస్ మోడ్లు ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిని మాడ్యులేట్ చేస్తాయి. ఇవి బైక్ రైడర్లకు డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్‌ను అందిస్తాయి.
- బజాజ్ కంపెనీ ఈ నయా పల్సర్ ఎన్250లోని టైర్స్‌ను కూడా మార్చింది. ఇంతకు ముందున్న 100-ఫ్రంట్, 130-సెక్షన్ రియర్ టైర్స్ స్థానంలో కొత్త 110-ఫ్రంట్, 140-రియర్ టైర్లను అమర్చింది. సీట్ హైట్‌ను కూడా 800mmకు పెంచింది. బ్రేక్స్ విషయానికి వస్తే ముందు భాగంలో 300mm, వెనుక భాగంలో 230mm రియర్ డిస్క్ బ్రేక్‌లను పొందుపరిచింది. ఈ బైక్ ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్ 165mm.
- డిజైన్ విషయానికి వస్తే, ఈ నయా బైక్‌లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. కానీ కొత్తగా ఎరుపు, తెలుగు, నలుపు రంగుల్లో కూడా బైక్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Bajaj Pulsar N250 Engine : ఈ కొత్త బజాజ్ పల్సర్ ఎన్250 బైక్‌లో కూడా 249.07సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్నే కొనసాగించారు. ఇది 24.5పీఎస్ పవర్, 21.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్ అనుసంధానంతో పనిచేస్తుంది.
Bajaj Pulsar N250 Rivals : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఎన్250 బైక్‌కు సుజుకి గిక్సర్ 250, కేటీఎం 250 డ్యూక్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లు గట్టి పోటీగా నిలువనున్నాయి. అన్నింటి కంటే బెస్ట్ విషయం ఏమిటంటే, ఈ అప్డేటెడ్ పల్సర్ ఎన్250 బైక్ ధర, దాని మునుపటి తరం బైక్ కంటే కేవలం రూ.851 మాత్రమే ఎక్కువ. కనుక కొత్తగా పల్సర్ బైక్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
Bajaj Upcoming Bikes : బజాజ్ కంపెనీ త్వరలో పల్సర్ ఎఫ్250ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400 బైక్‌ను ఈ 2024 మే 3న విడుదల చేయనుంది.