Allu Arjun : టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
Allu Arjun : కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ దేవర ని పోస్ట్ పోన్ చేసుకొని కాస్త విరామం ఇచ్చి వార్-2 సినిమా సెట్స్ పైకి వెళ్లాడు.అయితే ఇప్పుడు బన్నీ కూడా ఇదే రూటు ఫాలో అవ్వబోతున్నాడు.
ఎన్టీఆర్ లానే బన్నీ కూడా పుష్ప-2( Pushpa-2 )పై చాలా టైమ్ పెట్టాడు.ఇప్పుడు ఈ హీరో కూడా ఒకేసారి 2 ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ అయ్యాడట.పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే అట్లీ( Atlee Kuma ) ప్రాజెక్టుకు షిఫ్ట్ కానున్నాడు అల్లు అర్జున్.అయితే ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వస్తుందని అందరు భావించారు.
కానీ ప్రకటన కాస్త ఆలస్యమైంది.త్వరలోనే ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు డైరెక్టర్ అట్లీ.
అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సినిమా పని మీదే ఉన్నాడు.
ఆల్రెడీ హీరో-దర్శకుడి మధ్య మీటింగ్స్ కూడా మొదలయ్యాయి.ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో మొదలు కానుంది.కాబట్టి పుష్ప-2 సినిమా కొలిక్కి వచ్చినా రాకపోయినా, బన్నీ మాత్రం తన కొత్త ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.మేకోవర్ సమస్యలు లేకపోతే 2 సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ.