Unstoppable with NBK: బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలోనే సీజన్ 4 ప్రసారం కానుంది. ఈ సీజన్ మ4 లో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా.. చంద్రబాబు నాయుడు రావటంతో.. అలానే ఈరోజు విడుదలైన ప్రోమోలో.. చంద్రబాబు నాయుడు పై బాలకృష్ణ చిలిపి ప్రశ్నలు కురిపించడంతో.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి.
Unstoppable with NBK: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా ఇప్పుడు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇక తాజాగా అక్టోబర్ 25వ తేదీ.. నుంచి ఈ షో నాలుగవ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షోకి రాబోతున్న ముఖ్య అతిథికి సంబంధించిన ప్రోమోని కూడా మేకర్స్ విడుదల చేశారు.
Unstoppable with NBK: అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ ఫస్ట్ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రోమోని విడుదల చేయగా.. ఈ ప్రోమోలో ఎన్నో విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్తులో టిడిపి పార్టీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందా..? లేక లోకేష్ చేతుల్లోకి తీసుకుంటారా..? అనే విషయంపై కూడా బాలకృష్ణ ప్రశ్నించినట్లు సమాచారం.
నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ , ఎన్టీఆర్ మధ్య మాటలు లేవన్న విషయం తెలిసిందే. దీనికి తోడు నారా చంద్రబాబు నాయుడు కూడా..ఎన్టీఆర్‌ను దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో.. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.మరొకవైపు బాలకృష్ణ 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ.. వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాకపోవడంతో ఇంకా వీరి మధ్య గొడవలు సద్దుమనగ లేదంటూ.. అందరూ కామెంట్లు చేశారు.
రాత్రంతా తలుపు కొట్టినా తీయలేదు.. జైలు జీవితంపై చంద్రబాబు.. అన్‌స్టాపబుల్ ప్రోమో
“దేశ రాజకీయ చరిత్రలో ఎవరూ ఎరగని విజయాన్ని అందుకున్న చాణక్యుడు.. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు.. మా బావగారు.. మీ బాబు గారు..” అంటూ చంద్రబాబును ఘనంగా ఆహ్వానించారు బాలయ్య. ఇక వచ్చీ రాగానే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు బాబు. ఇక తర్వాత సీఎం చంద్రబాబుతో బాలకృష్ణ ఓ వెరైటీ ప్రమాణం చేయించారు. “చంద్రబాబునాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెబుతానని” అంటూ ప్రమాణం చేయించగా.. దానికి “సమయస్ఫూర్తిగా సమాధానం” చెబుతా అంటూ నవ్వులు పూయించారు బాబు. అలానే బాలయ్య మీద ఒట్టేసి అన్నీ చెబుతా అంటూ చంద్రబాబు అనగానే బాలకృష్ణ కాస్త కంగారు పడ్డారు.
జైలు జీవితం గురించి
ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ సహా పలు విషయాల గురించి బాలయ్య ప్రశ్నలు అడిగారు. గీత దాటని మనిషి మీరు.. అలాంటిది మీ కోసం వాళ్లు గీత దాటి ప్రవర్తించారు.. అసలు మీ అరెస్ట్ గురించి మీకు ముందే సమాచారం ఉందా అంటూ బాలయ్య అడిగారు. దీనికి “నేను బస్సులో ఉండగా నన్ను అరెస్ట్ చేశామని.. చెప్పారు.. అలానే జైల్లో మొదటి రోజు రాత్రంతా తలుపు కొట్టినా తీయలేదు.. మనసులో ఒకటే ఆలోచన.. చావు గురించి ఆలోచించలేదు కానీ.. ఆ 53 రోజులు కూడా అదే జరిగింది.” అంటూ చంద్రబాబు చెబుతుంటే బాలయ్య ఎమోషనల్ అయ్యారు. అయితే తప్పు చేసినవారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ బాబు వార్నింగ్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్‌తో పొత్తుపై
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన పవన్ కళ్యాణ్-చంద్రబాబు మీటింగ్ గురించి బాలయ్య ప్రస్తావించారు. ఆకాశంలో సూర్య చంద్రలు-ఆంధ్రాలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ అంటున్నారు.. ఆ జైలు గోడల మధ్య మీ ఇద్దరి మధ్య అసలు ఏం చర్చ జరిగింది అనేది చెప్పండి బావ అంటూ బాలయ్య అడిగారు. 2 నిమిషాల పాటు జరిగిన ఆ చర్చలో కొత్త చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా మేము చేసిన నిర్ణయం ఖచ్చితంగా ఓ చరిత్ర అంటూ చంద్రబాబు చెప్పారు.
ఆ తర్వాత కాస్త సిల్లీ కొశ్చన్స్ కూడా అడిగారు బాలయ్య. మా చెల్లెలితో కలిసి మీరు రొమాంటిక్ సినిమా ఒకటి చెప్పండి అంటూ బాలయ్య అడగ్గా నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలొస్తాయ్ అంటూ బాబు నవ్వుకున్నారు. ఇలా ప్రోమో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సాగింది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 25 ప్రీమియర్‌గా అందుబాటులోకి రానుంది.
బావ’జాలం’.. బామ్మర్ది గాలం
బావ వర్సెస్ బావమరిది.. నారా చంద్రబాబు.. వర్సెస్ నందమూరి బాలకృష్ణ. ఆహాలో ఈసారి వీళ్ల ఫన్నీ ఫైటింగ్ మామూలుగా ఉండేట్టులేదు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్లో ఓసారి తనయుడు లోకేష్‌తో కలిసి గెస్టుగా వచ్చి.. హోస్ట్ సీట్లో ఉన్న బాలయ్యతో ఫన్గేమ్ ఆడారు. అప్పుడాయన ప్రతిపక్షనేత. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్. ముఖ్యమంత్రి హోదాలో అదే రియాలిటీ షోలో నయా సీజన్‌కి అతిథిగా వచ్చారు చంద్రబాబు. గెస్ట్ ఇంట్రడక్షన్ దగ్గరే హోస్ట్ హ్యూమర్ పవర్ ఏంటో తెలిసిపోయింది.
క్వశ్చనింగ్లో ఆయన.. ఆన్సరింగ్లో ఈయన అన్‌స్టాపబుల్ సీజన్-4కి కిక్ స్టార్ట్ ఇవ్వబోతున్నారు. ట్రయిలర్తోనే ఫన్ అన్లిమిటెడ్ అని సాలిడ్‌గా ఓ హింట్ ఇచ్చేశారు. ఫన్ను దగ్గరే ఆగలేదు. చంద్రబాబు మనోగతాన్ని ఆవిష్కరించడంలో బరువైన ఎమోషన్లు కూడా పండించారు మిస్టర్ అఖండ.
జైలు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల్ని ఇదే డయాస్ మీద షేర్ చేసుకుంటారా..? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఉండే ఎటాచ్మెంట్ ఎలాంటిది.. పొత్తు కుదుర్చుకునే ముందు రాజమండ్రి జైల్లో ఇద్దరిమధ్యా జరిగిన మంతనాలేంటి.. అనేది అంతకుమించిన క్యూరియాసిటీ.
వీళ్ల ఫన్గేమ్లోకి ఇద్దరి ఫ్యామిలీల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకెంత మజా..? ఇంటిగుట్టు రచ్చన పడకుండా.. అలాగని హ్యూమర్ మిస్ కాకుండా.. టెంపో కంటిన్యూ చేస్తూ.. ఎవరు ఎంత జాగ్రత్తపడ్డారు..? వైజాగా విజయవాడా.. దేనికి మీ ఓటు అంటే చంద్రబాబు ఏం చెబుతారు..? నా చెల్లెలితో చూసిన రొమాంటిక్ సినిమా ఏంటి.. అన్నప్పుడు బావ నిజంగానే ఇరకాటంలో పడ్డారా..? బాబు కెప్టెన్సీని ధోనీతో పోల్చినప్పుడు వచ్చిన రియాక్షన్లేంటి..? ఇలా సీరియస్ కంటెంటే కాదు.. హిలేరియస్ కౌంటర్లక్కూడా కొరతల్లేవు.
గన్ ఒకరిది.. ఫన్ ఒకరిది.. కానీ ఎవరిది గన్ను.. ఎవరిది ఫన్ను తెలుసుకోవడమే కష్టం. ఎందుకంటే.. ఒకర్ని మించి మరొకరు హ్యూమర్‌ని పండించారని వాళ్లవాళ్ల ఫ్యాన్ ఫాలోయింగులు సర్టిఫై చేస్తున్నాయి. ఇంతకీ.. ఈ ఫన్ అన్లిమిటెడ్ పోటీలో ఎవరు తగ్గారు.. ఎవరు నెగ్గారు.. బావనుంచి కావల్సినంత స్టఫ్ఫును రాబట్టడంలో బాలయ్య సక్సెస్ అయ్యాడా.. లేక ఆ బావగారే దాగుడుమూతలతో సరిపెట్టారా.. అనేది అక్టోబర్ 25న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యాకే తెలిసేది. కాగా ఈ ప్రొమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ 1లో కొనసాగుతోంది.
బోత్ ఆర్ నాట్ సేమ్.. చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్..
బాబు రాగానే అన్‌స్టాపబుల్ బుక్ పై ఆయనతో ప్రతిజ్ఞ చేయించాడు బాలకృష్ణ. ఏది అడిగితే దానికి సమయస్ఫూర్తిగా సమాధానం చెబుతానని ప్రమాణం చేస్తున్నానంటూ చంద్రబాబు చెప్పారు. ప్రోమో మొదట బాబు జైలుకెళ్లడం, 53 రోజుల పాటు అక్కడ గడపడం.. దీని చుట్టూ ప్రశ్నలు సాగాయి. ఆ తర్వాత మెల్లగా పవన్ కల్యాణ్ తో జైల్లో సమావేశం ఎలా మలుపు తిప్పిందన్నదానిపైకి చర్చ మళ్లింది.
ఈ సీరియస్ అంశాలు ముగిసిన తర్వాత బావ, బావ మరదులు మధ్య సరదా సంభాషణ మొదలైంది. ఆకాశంలో సూర్యచంద్రుల్లాగే ఆంధ్రాలో బాబు గారు, కల్యాణ్ బాబు అంటున్నారంటూ బాలయ్య తనదైన స్టైల్లో చెప్పాడు. బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ జోక్స్ ఉంటాయంటూ బాబు అన్నారు.
మా చెల్లితో మీరు చూసిన రొమాంటిక్ మూవీ ఒక్కటి చెప్పండని బాలయ్య అడిగితే.. నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఎలా అంటూ బాబు చమత్కరించారు. ఇక తనకు ఎప్పుడూ విరాట్ కోహ్లి అంటేనే ఇష్టమని ధోనీ, కోహ్లిలలో ఒకరిని ఎంచుకోమని అడిగినప్పుడు చంద్రబాబు తెలిపారు.
ఇంట్లో తన చెల్లి భువనేశ్వరి, కూతురు బ్రాహ్మణిలలో ఎవరు బాస్ అని బాలయ్య అడిగిన ప్రశ్నకు కూడా బాబు సరదాగా స్పందించారు. ఇలా ఐదు నిమిషాల పాటు సాగిన ప్రోమో తొలి ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. శుక్రవారం (అక్టోబర్ 25) రాత్రి 8.30 గంటలకు ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే తొలి ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి.