Daku Maharaj Collections : నందమూరి నటసింహం బాలకృష్ణ ‘డాకు మహారాజ్’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్న ఈ సినిమా, తాజాగా మరో మైలురాయి సాధించింది.
Daku Maharaj-ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. రిలీజైన 4 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రావడం వల్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ 4 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.105 కోట్లు వసూల్ చేసింది’ అంటూ మేకర్స్ ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ రూ.105 కోట్ల గ్రాస్ సాధించింది.
వరుసగా నాలుగు
కాగా, బాలయ్య కెరీర్లో వరుసగా నాలుగోసారి వంద కోట్ల మార్క్ అందుకున్నారు. ఇదివరకు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలు ఈ ఎలైక్ క్లబ్లో చేరాయి. అయితే ఈ అన్నింటికంటే డాకు మహారాజ్ కేవలం 4 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు చేయడం విశేషం.
డైరెక్టర్ బాబీ కొల్లి ఫుల్ మాస్ యాక్షన్ జానర్లో తెరక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. తమన్ సంగీతం అదిరిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు.

‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ – Daaku Maharaaj Review
నటులు:
దర్శకుడు: బాబీ కొల్లు
సినిమా శైలి:Drama
వ్యవధి:2 Hrs 27 Min
బాలయ్యని డైరెక్ట్ చేసిన ఏ దర్శకుడైనా చెప్పే మాట.. బాబు బంగారం అనే. బయట ఏదో కొడతారు.. తిడతారనే టాక్ ఉంది కానీ.. ఆయనతో పనిచేసిన వాళ్లు మాత్రం చేస్తే బాలయ్యతో పని చేయాలి.. తీస్తే బాలయ్యతో సినిమా చేయాలనే అంటారు. బాలయ్య కాంపౌండ్‌లో ఏ దర్శకుడైనా అడుగుపెట్టారంటే.. అతనితో సినిమా చేస్తున్నట్టే. అంత ఫ్రీడమ్ ఇస్తుంటారు బాలయ్య బాబు. అందుకే ఆయన్ని దర్శకుల హీరో అని అంటుంటారు. అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు బాలయ్యతో ఏ దర్శకుడు చేసినా.. ఆయన్ని ఊచకోత పితామహుడిగానో.. రివేంజ్ డ్రామాల రూపకర్తగానో.. లేదంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలకు పెట్టింది పేరుగానో చూపిస్తున్నారు తప్పితే రొటీన్‌కి భిన్నంగా ప్రయోగాత్మక పాత్రల్లో చూపించలేకపోతున్నారు. అయితే తనకి వచ్చిన నచ్చిన రొటీన్ ఫార్మేట్, కమర్షియల్ యాంగిల్‌తో తప్ప.. మరో జానర్లో సినిమా తీయలేనని బాహాటంగానే చెప్పిన దర్శకుడు బాబీ కొల్లు.. బాలయ్యని ‘డాకు’గా ఎలా చూపిస్తారో ముందే ఓ అంచనాకు వచ్చేస్తూ సమీక్షలోకి వెళ్లిపోదాం.
ఛంబల్ ప్రాంతంలో భల్వన్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్) తన ఇద్దరు అన్నదమ్ములతో కలిసి మైనింగ్ మాఫియా చేస్తుంటాడు. మైనింగ్ చాటున దేశ విదేశాలకు కొకైన్‌ని సరఫరా చేస్తూ.. ఛంబల్ ప్రాంత ప్రజల్ని బానిసలుగా చేసి.. వాళ్లు తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా చేస్తాడు. వీళ్ల దాహార్తిని తీర్చడానికి దేవుడొస్తాడని ఛంబల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆ ప్రాంతానికి సివిల్ ఇంజనీర్‌గా వస్తారు సీతారామ్ (బాలకృష్ణ). వాళ్ల నీటి సమస్య తీరాలంటే క్వారీలను మూయించి అదే ప్రాంతంలో డ్యాం నిర్మించాలని అనుకుంటాడు సీతారాం. ఆ ప్రయత్నాన్ని ఠాగూర్ ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి అడ్డుకుంటాడు. ఆ తరుణంలో ఛంబల్ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఆయుధం పట్టి ‘డాకు మహారాజ్’గా మారతాడు సీతారాం. ఇదంతా బ్యాక్ డ్రాప్ కథ కాగా.. దీనికి ఇన్నర్ టెంప్లెట్ కథను ఫస్టాఫ్‌లో చూపిస్తారు.
చిన్నారి వైష్ణవిని శత్రుమూకల నుంచి కాపాడటం కోసం ఆమెకు రక్షణగా మారతాడు నానాజీ అలియాస్ డాకు. అసలు ఆ పాప ఎవరు? ఈ పాపకి ఛంబల్ కథకి లింక్ ఏంటి? డాకు మహారాజ్‌గా ఉన్న సీతారాం.. డ్రైవర్ నానాజీగా ఎందుకు మారాడు? పాపకి నందిని (శ్రద్ధా శ్రీనాథ్)కి లింక్ ఏంటి? చివరికి డాకు.. ఛంబల్లో డ్యాం నిర్మించడానికి ఎలాంటి సహసానికి పూనుకున్నాడు అన్నదే ‘డాకు మహరాజ్’ కథ.

డాకు ఒరిజినల్ స్టోరీ చూస్తే.. అతను పోలీసుల దృష్టిలో నేరస్థుడు కానీ కొన్ని ఊళ్లకి దేవుడు. మాన్ సింగ్ ఇన్స్పిరేషన్తోనే ‘డాకు మహారాజ్’ కథను అల్లారు దర్శకుడు. తనకి వచ్చిన నచ్చిన రొటీన్ ఫార్మేట్‌లోనే బాలయ్యని కొత్తగా చూపించే ప్రయత్నంచేశారు. చెడుపై పోరాడే మంచి హీరో. అతనికో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. సీతారం, డాకు, నానాజీ ఇలా మూడు వేరియేషన్స్‌లో బాలయ్యని చూపిస్తూ.. రొటీన్ ఫార్మేట్కి కొత్త కలరింగ్ సెటప్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ పడేవరకూ అసలు మెయిన్ కథని రివీల్ చేయకుండా.. పాప రక్షించే రక్షకుడిగా బాలయ్యని చూపించి.. సెంకడాఫ్‌లో అసలు కథలోకి వెళ్లారు. పాపకి ప్రాణహాని ఉందని తెలిసి.. డ్రైవర్ నానాజీకి ‘డాకు’ ఎంట్రీ.. కథకి కొత్త ఎత్తుగడగా అనిపిస్తుంది. పాత్రల్ని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ.. అసలు కథలోకి వెళ్లడానికి చాలానే టైం తీసుకున్నారు. ఎప్పుడైతే నానాజీ పాత్ర నేపథ్యం రివీల్ అవుతుందో అప్పటి నుంచి కథ పుంజుకుంటుంది.






ఇక బాలయ్య సినిమా అనేసరికి తమన్‌కి పూనకం వస్తుందో ఏమో కానీ.. అతను చెప్పినట్టుగానే స్పీకర్లు పగిలేట్టు బాదిపడేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్యాలస్ సీక్వెన్స్, ఇసుక తుఫాన్ సీన్లకి తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి బాక్స్‌లు బద్దలు అనేట్టే ఉంది. దర్శకుడు బాబీ గత చిత్రాలకంటే ‘డాకు’ విజువల్ టేకింగ్ చాలా రిచ్‌గా అనిపించాయంటే.. కెమెరామెన్ విజయ్ కన్నన్ తన పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. ఎడిటర్స్ రూబెన్స్, నిరంజన్.. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫైట్ మాస్టర్ వెంకట్ మనసు పెట్టి పని చేయడంతో టెక్నికల్ పరంగా మంచి ఔట్ పుట్ వచ్చింది.
ఓవరాల్‌గా.. ‘డాకు మహారాజ్’ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా థియేటర్స్‌కి వెళ్తే మెప్పిస్తుంది. రొటీన్ సినిమానే కానీ.. పండక్కి పైసా వసూల్.