Saif Ali Khan Attack : బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై గురువారం జరిగిన ఎటాక్ బీ టౌన్‌ను కుదిపేసింది. ఓ దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన సైఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఆయన సతీమణి కరీనా కపూర్ స్పందించారు. తమ కుటుంబానికి ఇది కఠినమైన రోజు అని, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Saif Ali Khan Attack-‘మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కఠినమైన సమయంలో మద్దతుగా నిలిచినవారందరికి కృతజ్ఞతలు. మీడియా, ఫ్రీలాన్సర్లు కాస్త సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మా పై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ, ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
ఇదీ జరిగింది
కాగా, గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా, ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన ఆయనకు లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
చిరు, ఎన్టీఆర్ విచారం
ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. దాడి విషయం తెలిసి తాము షాకయ్యామని అన్నారు. ‘సైఫ్ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి పోస్ట్ పెట్టారు. ‘సైఫ్ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
కేర్‌టేకర్‌ను బెదిరించి చేసి రూ. కోటి డిమాండ్! – సైఫ్‌పై అటాక్‌కు అదే కారణమా?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేసిన దుండగుడు తొలుత కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయన 4 ఏళ్ల కుమారుడు జహంగీర్ ఉన్న గదిలోకి దొంగ రావడాన్ని అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఎలియామా ఫిలిప్స్ గుర్తించారు. రాత్రి 2 గంటలకు శబ్దాలు రావడం వల్ల నర్సుకు మెలకువ వచ్చింది. అయితే బిడ్డను చూసేందుకు కరీనా కపూర్ వచ్చి ఉంటుందని ఆమె భావించింది.
అయితే అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లగా, దొంగ ఆమెను పట్టుకుని నిశ్శబ్ధంగా ఉండాలని బెదిరించాడు. ఆ సమయంలో కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడిని పట్టుకునే క్రమంలో నర్సు మణికట్టుపై నిందితుడు కత్తితో పొడిచాడు. అలికిడి కావడం వల్ల సైఫ్ అక్కడకు వచ్చి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆయనపై కూడా దాడి జరిగిందని పోలీసులు వివరించారు.
ఇదిలా ఉండగా, దుండగుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. కర్ర, ఆక్సా బ్లేడుతో పారిపోతున్న నిందితుడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అందులో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది.
మరోవైపు ఈ ఘటన నుంచి కోలుకోవడానికి తన కుటుంబానికి సమయం ఇవ్వాలని కరీనాకపూర్ విజ్ఞప్తి చేశారు. తమ గోప్యతను గౌరవించాలని కోరారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
‘మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కఠినమైన సమయంలో మాకు మద్దతుగా నిలిచినవారందరికి కృతజ్ఞతలు. మీడియా, ఫ్రీలాన్సర్లు కాస్త సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలు అలాగే కవరేజీకి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ, ఇలాంటి చర్యల వల్ల మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా” అని సోషల్ మీడియాలో కరీనా పోస్ట్ చేశారు.
సైఫ్‌పై దాడి చేసిన నిందితుడి ఫొటో రిలీజ్- అత్యవసర మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచిన దుండగుడిని గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. అతడిని పట్టుకునేందుకు పది బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు సైఫ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్సచేసి కత్తిని తొలిగించినట్లు తెలిపిన ముంబయి లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రకటించారు.
ఇదీ జరింది
సైఫ్ అలీఖాన్ పటౌడీపై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్, పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఘర్షణ జరగ్గా గుర్తుతెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్‌ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిగాట్లకు గురైన సైఫ్ అలీఖాన్‌ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. కారు సిద్ధంగా లేకపోవడం వల్ల ఆటోలో సైఫ్‌ను తరలించినట్లు సమాచారం.
అలీఖాన్‌ను పరామర్శించిన ప్రముఖులు
తెల్లవారుజామున మూడున్నర గంటలకు లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్‌కు ఒంటిపై ఆరుచోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. నాలుగు చోట్ల కొద్దిగా, రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు తెలిపారు. వెన్నెముక వరకూ 2.5 ఇంచుల కత్తి శరీరంలోకి దిగిందని తెలిపిన డాక్టర్ నీరజ్ ఉత్తమని, న్యూరోసర్జన్ నితిన్ డంగే శస్త్రచికిత్స చేసి ఆయుధాన్ని తొలిగించామని వివరించారు. వెన్నెముక నుంచి కారుతున్న స్రావాలను నియంత్రించ గలిగామని డాక్టర్ నితిన్ డంగే చెప్పారు. సైఫ్ ఎడమ చేతి మణికట్టుపైనా లోతైన గాయం కావడం వల్ల ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు డాక్టర్ నీరజ్ ఉత్తమని వెల్లడించారు. శస్త్రచికిత్స తర్వాత సైఫ్ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డారని శుక్ర లేదా శనివారం ఐసీయూ నుంచి వార్డుకు తరలిస్తామని వెల్లడించారు. మరోవైపు సైఫ్ అలీఖాన్‌ను కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు ప్రముఖులు పరామర్శించారు.
ఎలాంటి ప్రమాదం లేదు
శస్త్రచికిత్స జరిగిన తర్వాత సైఫ్ కోలుకుంటున్నారని ఆయన వ్యక్తిగత బృందం కూడా ప్రకటించింది. సైఫ్‌కు ఎలాంటి ప్రమాదంలేదని తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరింది.
నిందితుడి కోసం పది బృందాలు
సైఫ్ అలీఖాన్ ప్రతినిథులు ఇచ్చిన ఫిర్యాదుతో ముంబయి బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఆర్ఐను నమోదైంది. దాడి ఘటనను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి పని మనుషులను ప్రశ్నించారు. ఒక పనిమనిషిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో సైఫ్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్‌లు నటుడి ఇంటి వద్ద ఆధారాలను సేకరించాయి. దొంగతనం చేసేందుకు మెట్ల వెనక నుంచి వచ్చిన దుండగుడు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు బయటకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన అత్యవసర మెట్ల ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు పది బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
సైఫ్ ఈజ్ సేఫ్- వెన్నెముక నుంచి కత్తిని తొలగించాం: వైద్యులు
Saif Ali Khan Health Update : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి ఓ కత్తిని తొలగించినట్లు ప్రకటించారు. అయితే సైఫ్ ఎడమ చేయి, మెడపై తీవ్రగాయాలు అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు.
ఆటోలో ఆస్పత్రికి!
అయితే గాయపడ్డ సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు పలు వార్తలు ప్రచురితమయ్యాయి. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఏ కారు కూడా రెడీగా లేదని, ఇబ్రహీం తన తండ్రిని ఓ ఆటోలో తీసుకువచ్చాడని ఆ వార్తల సారాంశం.
దొంగ దొరికాడుగా!
మరోవైపు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, చోరీ కోసమే నిందితుడు అక్కడికి వచ్చినట్టు తేలిందని అన్నారు. వెనుక మెట్ల ద్వారా అతడు సైఫ్ ఇంట్లోకి వచ్చాడని పేర్కొన్నారు. అంతకు ముందు ఏడు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, సైఫ్ నివాసానికి చేరుకొని అక్కడ పనిచేస్తోన్న వారందరినీ ప్రశ్నించారు. ఫ్లోర్ పాలిషింగ్ చేసే వ్యక్తులను కూడా విచారించారు.
అయితే దాడి జరిగిన సమయంలో కరీనా, తైమూర్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు కన్ఫార్మ్ చేశారు. అంతేకాకుండా సైఫ్ ఇంట్లోని సిబ్బందిలోనే ఎవరో ఈ చర్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది :
బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన జరిగింది. సైఫ్ తన కుటుంబసభ్యులతో నిద్రిస్తున్నసమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేహ్ గదిలో దూరినట్లు పలు వార్తలు వచ్చాయి. అయితే దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేసింది. దీంతో సైఫ్ హడావుడిగా అక్కడికి చేరుకొన్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్‌పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందనని ఆ వార్తల్లో ఉంది.
సైఫ్ అలీఖాన్‌పై ఎటాక్- ఆరు సార్లు పొడిచి పరారైన దుండగుడు
ఇదీ జరిగింది :
పోలీసులు, సైఫ్ పీఆర్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం. బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్, పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఏదో అలికిడి వినపడింది. దీంతో ఉలిక్కి పడ్డ సైఫ్ అది ఏంటో తెలుసుకునేందుకు సౌండ్ వచ్చిన వైపుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఓ దుండగుడు ఆయన కంట పడ్డాడు. అయితే ఆ అవతలి వ్యక్తి ఎవరా అని చూస్తున్న సమయంలో ఆ దుండగుడు సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి సైఫ్‌కు చిన్నపాటి ఘర్షణ జరిగింది. అయితే దుండగుడిని నిలవరిస్తున్న సమయంలో అతడు సైఫ్‌ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిగాట్లకు గురైన సైఫ్‌ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.
ఆరు చోట్ల గాయాలు
ఇదిలా ఉండగా, తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్‌కు ఒంటిపై ఆరుచోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. నాలుగు చోట్ల కొద్దిగా, అలాగే రెండు చోట్ల లోతుగా గాయమైనట్లుగా లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ముఖ్యంగా వెన్నుముఖకు సమీపంలో గాయాలైనట్లు వివరించారు. అత్యంత పదునైన ఆయుధంతోనే ఈ దాడి జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.
ఇది దొంగ పనేనా?
మరోవైపు ఓ గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్ అలీఖాన్ పీఆర్ టీమ్ వెల్లడించింది. ఈ విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీమ్ తెలిపింది. అభిమానులను అలాగే మీడియాను సంయమనం పాటించాలని కోరింది.

ఇక సైఫ్ పీఆర్ టీమ్ ఇచ్చిన ఫిర్యాదుతో ముంబయి బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడి ఘటనను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి పనిమనుషులను విచారించారు. ఇది దొంగపనేనా? అని ప్రశ్నించడంతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైఫ్ నివాసం సత్గురు శరణ భవనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
‘ఆ న్యూస్ విని షాకయ్యాను’
మరోవైపు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై తన కో స్టార్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ విషయం తెలుసుకుని షాకయ్యారని, తాను ఎంతో బాధపడ్డారని తెలిపారు. త్వరగా కోలుకోవాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. “సైఫ్ సర్‌పై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యాను. ఎంతో బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.” అని రాసుకొచ్చారు.