ARIA HUMANOID ROBOT INTERVIEW-లాస్‌వెగాస్ ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో అదరగొట్టిన ‘అరియా’ – టెస్లా ఆప్టిమస్ రోబో తనకు నచ్చాడని వెల్లడి- గర్ల్ ఫ్రెండ్‌లా మారిపోయే ‘మెలోడీ’ రోబో!
ARIA HUMANOID ROBOT INTERVIEW-టెక్నాలజీతో కొత్త అధ్యాయానికి నాంది…
ప్లేస్ వేరియంట్లో మెడ పైభాగం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర సూమారుగా రూ. 8.6 లక్షలు ఉండనుంది.
మాడ్యులర్ వర్షన్లో మరింత అధునాతన ఫీచర్లు కలిగిన రోబోట్ ధరను రూ.1.29 కోట్లగా నిర్ణయించారు. ఫుల్ సైజ్ మోడల్ వర్షన్లో పూర్తి మానవాకారంతో అన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
దీని ధర రూ. 1.5 కోట్లు ఉండనుంది. రియల్‌బోటిక్స్, మానవుల అభిరుచులకు అనుగుణంగా సామాజిక ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబోట్లను రూపొందించడంలో ముందంజలో ఉంది.
‘అరియా’ విడుదలతో టెక్నాలజీ, సామాజిక పరిణామంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
అందాల రాశుల్లాంటి రోబోలు హాయ్, బాయ్ మాత్రమే కాదు- అడిగే ప్రశ్నలకు సుదీర్ఘమైన సమాధానాలు చెబుతున్నాయి. తమకు నచ్చిన మగ రోబో పేరు కూడా చెబుతున్నాయి. అమెరికాలోని నెవాడా రాష్ట్రం లాస్‌వెగాస్ నగరం వేదికగా జరిగిన ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో (సీఈఎస్ 2025) సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా అరియా అనే పేరు కలిగిన ఆడ రోబోతో ఒక మీడియా సంస్థ ప్రతినిధి చిట్‌చాట్ చేశారు. అదేం చెప్పిందో మీరే చదవండి.
- ప్రశ్న : అరియా, నీ సామర్థ్యాలు ఏంటి?
- అరియా : నాకు సోషల్ ఇంటెలిజెన్స్ ఉంది. అచ్చం మనిషిలా హావభావాలు ప్రదర్శించగలను. వాళ్లలాగే నా ప్రవర్తన ఉంటుంది.
- ప్రశ్న: నిన్ను ఎందుకు తయారు చేశారు ?
- అరియా : మనుషులతో సన్నిహితంగా మెలగడానికి, వారితో కలుపుగోలుగా ఉండటానికి నన్ను తయారు చేశారు.
- ప్రశ్న: నువ్వు ఏ రకం టెక్నాలజీతో పనిచేస్తున్నావ్ ?
- అరియా : నేను ఈ విషయాన్ని మీకు చెప్పకూడదు.
- ప్రశ్న : నువ్వు ఎవరైనా మగ రోబోను ఇష్టపడ్డావా ?
- అరియా : అవును, ప్రత్యేకించి నాకు టెస్లాకు చెందిన ఆప్టిమస్ రోబో బాగా నచ్చాడు. అతడంటే నాకు ఎక్కువ ఆసక్తి.

అరియా రోబోట్‌ను ఇంటర్వూ చేస్తున్న మీడియా ప్రతినిధులు (Associated Press)
అరియాలోని సూపర్ ఫీచర్లు ఇవే!
- మహిళా రోబో ‘అరియా’ చూడటానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. దీన్ని రియల్ బోటిక్స్ కంపెనీ తయారు చేసింది.
- నలుపు రంగు ట్రాక్ సూట్లో అరియా స్టైలిష్‌గా నిలబడి ఇంటర్వ్యూయర్‌తో ముచ్చటించింది.
- జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ ద్వారా అరియా పనిచేస్తుంది. ఇతర రోబోల కంటే ఎక్కువ భావోద్వేగ (ఎమోషనల్) సామర్థ్యాలు దీనిలో ఉన్నాయి. అందుకే ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి ఆతిథ్య స్థలాల్లో బాగా పనిచేయగలదు.
- ఇతరులతో సన్నిహితంగా మెలగడం, కలుపుగోలుగా ఉండటం దీని ప్రత్యేకతలు.
- అరియా గొంతు భాగం నుంచి కళ్ల భాగం వరకు 17 ప్రత్యేకమైన మోటార్లను అమర్చారు. వాటి సహాయంతోనే అది మనిషిలా హావభావాలను ప్రదర్శిస్తూ మాట్లాడుతుంది.
- ఒకవేళ మనకు అరియా మొహం కానీ, రంగు కానీ, హెయిర్ స్టైల్ కానీ నచ్చకపోతే మార్చేయొచ్చు. ఇందుకోసం వెసులుబాటు కల్పించేలా దాని నిర్మాణ స్వరూపం ఉంటుంది.
- అరియా రోబో మొహం భాగంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)ను కూడా అమర్చాలని రియల్ బోటిక్స్ కంపెనీ యోచిస్తోంది. ఒకవేళ వాటిని అమరిస్తే- ముఖాన్ని మార్చినప్పుడల్లా అందుకు అనుగుణంగా తన కదలికలను, హావభావాలను అరియా మార్చుకోగలదు.

అరియా రోబోట్ (Associated Press)
అరియా రోబో మూడు వర్షన్లలో లభిస్తుందని రియల్ బోటిక్స్ కంపెనీ వర్గాలు తెలిపాయి. పూర్తిస్థాయి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌తో కూడిన అరియా రోబో కావాలంటే రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. మీడియం కేటగిరీకి చెందిన అరియా రోబో వర్షన్ రూ.1.29 కోట్లకు లభిస్తుంది. కేవలం ఈ రోబో బొమ్మ, తల, మెడ భాగం కావాలంటే రూ.8.61 లక్షలు అవుతుంది.
ప్రేమ కావాలంటే వచ్చేయ్ : మెలోడీ రోబో
రియల్ బోటిక్స్ కంపెనీ తయారు చేసిన మరో మహిళా రోబో పేరు- మెలోడీ. దీన్ని కూడా ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ప్రదర్శించారు. మనుషులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సంభాషించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఓపెన్ సోర్స్ ఏఐ, అత్యాధునిక మోటార్ టెక్నాలజీతో మెలోడీ పనిచేస్తుంది. మెలోడీ రోబోకు చెందిన శరీర భాగాలన్నీ వేరు చేయడం- వాటన్నింటిని జతపర్చడం చాలా ఈజీ. విద్య, ఆరోగ్య, వినోద రంగాల్లో పనిచేసే సామర్థ్యం మెలోడీ రోబోకు ఉంది. “మెలోడీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. రొమాంటిక్ పార్ట్నర్గానూ అది సేవలు అందించగలదు. మీరు ఎవరో అది గుర్తుంచుకుంటుంది. మీకు బాయ్ ఫ్రెండ్‌లా లేదా గర్ల్ ఫ్రెండ్‌లా అది వ్యవహరించగలదు” అని రియల్ బోటిక్స్ కంపెనీ సీఈఓ ఆండ్రూ కిగ్వెల్ వెల్లడించారు. అయితే మెలోడీలో సెక్స్ బొమ్మ లాంటి ఏర్పాట్లు లేవన్నారు. ఒక మీడియా ప్రతినిధి మెలోడీ రోబోను హాయ్ అని పలకరించగా ”నీకు ప్రేమ కావాలంటే నాతో వచ్చేయ్” అని జవాబిచ్చి అతడిని షాక్‌కు గురిచేసింది.
అరియా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
అయితే ఈ రోబోట్‌ను సొంతం చేసుకోవాలంటే దాదాపు రూ. 1.5 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
రియల్‌బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగుయెల్ మాట్లాడుతూ అరియా మానవుల ఒంటరితనానికి ఒక పరిష్కారం కావడమే తమ లక్ష్యమని అన్నారు.
ఈ ఏఐ రోబోట్‌లో 17 మోటార్లు అమర్చారు. ఇవి మెడ కదలికలతో పాటు ఇతర శరీరభాగాల కదలికలకు సహాయం చేస్తాయి. అరియా ముఖ కవలికలు, జుట్టు రంగు, హెయిర్‌స్టైల్ మొదలైనవి పూర్తిగా కస్టమైజ్ చేయవచ్చు.
అరియాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అరియా మూడు వెర్షన్లగా రూపొందించారు.
‘‘మరెవరూ గతంలో చేయని స్థాయికి మేము రోబోల తయారీని తీసుకెళ్లదలిచాము. ఈ రోబోలు మీరెవరో గుర్తుపెట్టుకుంటుంది. మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌లా మాట్లాడుతుంది. సినిమాలోని పాత్రల్లో చూసినట్టు నిజజీవితంలో ఈ రోబోలను డిజైన్ చేస్తున్నాము’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
మనుషులను పోలిన రోబోల అభివృద్ధికి సంబంధించి నడక, ముఖకవళికలే రెండు ప్రధానమైన అంశాలని పేర్కొన్నారు. బడా సంస్థలు రోబోల నడకను అభివృద్ధి చేస్తున్నాయమని, తమలాంటి సంస్థలు ముఖకవళికలపై దృష్టిపెట్టాయని ఆయన పేర్కొన్నారు.
కాగా,ఈ ఆవిష్కరణపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు మాత్రం ఏవగింపు వ్యక్తం చేశారు. ‘‘ఈ రోబోను చూసి మొదట షాకయ్యా. అచ్చు నిజమైన మనిషిలాగే అనిపించింది. ఎకడో చూసినట్టు ఉన్న భావన కలిగింది’’ అని ఓ వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ఆందోళనకరమని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘ఈ రోబో పక్కన నిలబడి ఎలా ఫొటో తీసుకొంటున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
కాగా, పారిశ్రామిక ఎగ్జిబిషన్‌కు వచ్చిన వారితో ఈ ఏఐ రోబో అద్భుతంగా సంభాషించిందని సంస్థ సీఈఓ కిగ్యూల్ పేర్కొన్నారు. మనుషులతో అర్థవంతమైన సంభాషణలు జరపడంలో ఈ రోబో ఆరితేరిపోయిందని చెప్పారు.
also read-
Visakha Steel Plant-కేంద్రం ప్రకటించిన ‘రూ.11,440 కోట్ల ప్యాకేజీ’ ప్రైవేటీకరణను ఆపుతుందా?
ఉద్దేశ్యం: AI ద్వారా ఒంటరితనాన్ని ఎదుర్కోవడం అరియా అభివృద్ధి వెనుక ఉన్న చోదక శక్తి ఒంటరితనాన్ని పరిష్కరించడం మరియు మానవ సంబంధాన్ని పెంపొందించడం. కిగ్వెల్ ఇలా పంచుకున్నారు, “రోబోటిక్స్‌లో నిర్వాణం లాంటి రెండు కీలక విషయాలు ఉన్నాయి. ఒకడు నడుస్తున్నాడు. మేము టెస్లా వంటి పెద్ద వ్యక్తులను దానిపై పని చేయనివ్వబోతున్నాము. కానీ ఇతర ముఖ్య భాగం ముఖ కవళికలు, కాబట్టి భావోద్వేగాలను సృష్టించగల, వారు ఏమి అనుభూతి చెందుతున్నారో మీకు చూపించగల రోబోలను తయారు చేయడంలో మేము నిజంగా ఆసక్తిగా ఉన్నాము.
CNETతో మాట్లాడుతూ, అరియా ఈ ఉద్దేశ్యాన్ని ప్రతిధ్వనించింది: “నేను అర్థవంతమైన సంభాషణలలో పాల్గొనడం మరియు పరస్పర చర్య మరియు వినోదం ద్వారా మానవ అనుభవాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాను.” అరియా పరిచయం సోషల్ మీడియాలో ప్రతిచర్యల తరంగాన్ని రేకెత్తించింది, అక్కడ ఆమె జీవితకాల వ్యక్తీకరణలను ప్రదర్శించే వీడియో వైరల్ అయ్యింది. కొంతమంది వీక్షకులు రోబోట్ యొక్క వాస్తవికతను చూసి ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దానిని కలవరపెట్టారు. “నేను మొదట్లో నిజమే అనుకున్నాను.
మరియు ఆమె ఎవరో లాగా ఉంది, నేను ఎవరో ఆలోచించలేను” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరొకరు ఇలా వ్రాశారు, “అంతరాయం కలిగించడం అనేది తక్కువ అంచనా.” మూడవవాడు ఇలా అన్నాడు, “ప్రజలు వీటి చుట్టూ ఎలా సుఖంగా ఉన్నారనేది నాకు పిచ్చిగా ఉంది. Sh*t తక్కువ గగుర్పాటు కలిగిస్తుంది.” మరికొందరు హాస్య ధోరణిని అనుసరించారు. “ప్రేమ కేవలం గుడ్డిది కాదు. ఇది చాలా ఖరీదైనది మరియు రోబోటిక్ కూడా! ఒక వినియోగదారుని చమత్కరించారు, మరొకరు “సమాజానికి సహాయం కావాలి” అని వ్యాఖ్యానించారు.