Union Budget analysis –కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనలు, అరుపుల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె తెలుగు కవి గురజాడ అప్పారావు గేయాన్ని ప్రస్తావించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ స్ఫూర్తితో దేశ ప్రజల మంచికోసం పనిచేస్తున్నట్లు చెప్పారు.
Union Budget analysis -దేశమంటే మనుషులోయ్ అంటూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు సహా ఆరురంగాల్లో సమూల మార్పులు చేశారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు, IIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్‌కు బడ్జెట్లో నిధులు కేటాయించారు.తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్లో చేయూతనిచ్చారు నిర్మల. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు.
మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించారు నిర్మల. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా లక్షలన్న రోట్లు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక ప్రకటించారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు, IIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్‌కు బడ్జెట్లో నిధులు కేటాయించారు.
పెరిగేవి ఇవే-
దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్
ప్రేమియం టీవీలు
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానల్ డిస్ప్లేలు
అల్లిన బట్టలు
బడ్జెట్ హైలైట్స్
బీమారంగంలో వంద శాతం ఎఫ్డీఐకు అవకాశం కల్పించారు. కస్టమ్స్ చట్టంలో 7 రకాల సుంకాలను తొలగించారు. క్యాన్సర్ ఔషధాలు, సర్జికల్ పరికరాలపై సుంకాలు తగ్గించారు. లిథియం బ్యాటరీలపై పన్ను తొలగింపుతో Led టీవీలు, మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి.
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్..
లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు విపక్షాలు నిరసన తెలిపాయి. ఇక నిరసనలు మధ్యే ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట
— రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు
— రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారికి శ్లాబులవారీగా పన్ను
— రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను
— రూ.24 లక్షల ఆదాయం దాటిన వారికి 30% శాతం పన్ను
— రూ.16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్ను
— ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు
— మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట
తగ్గేవి ఇవే
- చేనేత వస్త్రాలు
- తోలు వస్తువులు
- మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ
- ఎలక్ట్రిక్ వెహికల్స్
- భారతదేశంలో తయారైన దుస్తులు
- వైద్య పరికరాలు
- క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు
- పలు రకాల ఖనిజాలు
నిర్మల బడ్జెట్ పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట
- నిర్మల బడ్జెట్ పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట
- వచ్చేవారం కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లు ప్రవేవపెడతాం
- సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
- మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు
- బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంపు
- బీమాలో FDI 74 శాతం నుంచి 100 శాతానికి అనుమతి
- లక్ష ఇళ్ల నిర్మాణం కోసం రూ.15వేల కోట్లు
దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధ
- దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
- మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనల సరళీకరణ
- సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
- మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు
- నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్
- విద్యుత్ రంగంలో సంస్కరణలు
- అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక
- వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్
- భూరికార్డుల డిజిటలైజేషన్‌కు అధిక ప్రాధాన్యం
- హోమ్ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు
- IIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్
- గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు
- ఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదు
- కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం
కేంద్ర బడ్జెట్లో బిహార్‌కు భారీగా కేటాయింపులు
- బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తాం
- కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు
- బిహార్‌లో ఈ సంస్థ ఏర్పాటు
- మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక
- IIT పాట్నా విస్తరిస్తాం
- బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం
- ఇందులో భాగంగా పాట్నా ఎయిర్‌పోర్టు విస్తరణ
- వెస్టర్న్ కోసి ప్రాజెక్టుకు మంజూరు
- బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు
పట్టణాభివృద్ధికి రూ.లక్ష కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.లక్ష కోట్లు
- నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్
- అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక
- రాష్ట్రాల రుణాల పరిమితి జీఎస్డీపీలో 0.5శాతం పెంపు
- అణుఇంధన రంగంలో సంస్కరణలు
- 2033 నాటికి ఐదు స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం
వచ్చే ఏడాది అదనంగా 10 వేల మెడికల్ సీట్లు
- రానున్న ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు
- వచ్చే ఏడాది అదనంగా 10 వేల మెడికల్ సీట్లు
- వర్తకులకు 30 వేల పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు
- పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
- కొత్త పథకాల అమలుకు రూ.10 లక్షల కోట్లు
- జల్‌జీవన్ మిషన్ కింద దేశంలోని ఇంటింటికీ తాగునీరు
- జల్‌జీవన్ మిషన్ గడువు 2028 వరకు పొడిగింపు
పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం
- — అధికవృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ
- — గురజాడ పద్యాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్
- — వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు
- — ఆరు రంగాల్లో సమూల మార్పులు
- — పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం
- — ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన
- — 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
- — వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి
- — పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక
ఆర్ఆర్ఆర్కు రూ.34,367 కోట్లు.. మెట్రో రెండో దశకు రూ.24, 269 కోట్లు
అలాగే ఆర్ఆర్ఆర్ కు రూ.34,367 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సమర్పించాయి. మరో వైపు హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ.24, 269 కోట్లు అవసరమవుతాయి. ఇక మూసీ పునరుజ్జీవం కోసం రూ. 14, 100 కోట్లను కేంద్రం ఇవ్వాలని అభ్యర్ధిస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద నిధులు కేటాయించాలని… వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి రూ. 1800 కోట్లు రావాల్సి ఉందని బడ్జెట్ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గుర్తు చేస్తోంది.
తెలంగాణలో పధకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం..
తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో భారీ ప్రాజెక్టలకు శ్రీకారం చుట్టింది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవం వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతోంది. ఈప్రాజెక్టుల కోసం రూ. 1.63 లక్షల కోట్లు నిధులు అవసరమవుతాయి. పెద్దన్న మాదిరిగా రాష్ట్రాభివృద్దికి సహకరించాలని గతంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
కేంద్రబడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. అసలు ఉచిత పథకాలతో రెండు రాష్ట్రాలు ఆర్ధికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్నాయి. మరి ఈబడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ఆశలను కేంద్రం నెరవేరుస్తుందా..? భారీ ప్రాజెక్టులకు కేంద్రం సపోర్ట్ ఉంటుందా..?
also read-
oscar 2025 nominations : పోటీలో ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ అనూజ…!