AKHANDA 2 UPDATE-బాలయ్యకు విలన్‌గా సరైనోడిని దించిన బోయపాటి!
నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. అయితే బోయపాటి సినిమా అంటే విలన్ గురించి కూడా ప్రేక్షకులు చర్చించుకుంటారు. ఎందుకంటే ఆయన మూవీలో విలన్‌కు కూడా హీరో రేంజ్లో పవర్ఫుల్ సీన్స్ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా అఖండ సీక్వెల్లో విలన్ పాత్ర పోషించనున్న నటుడి పేరు బయటకు వచ్చింది. మరి ఆ నటుడు ఎవరంటే?
AKHANDA 2 UPDATE-తెలుగు యంగ్ హీరో ఈ మూవీలో విలన్ రోల్లో నటిస్తున్నారని ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సీక్వెల్లో విలన్ రోల్లో యువ నటుడు ఆది పినిశెట్టిని కన్ఫార్మ్ చేశారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తొలి పార్ట్‌లో శ్రీకాంత్‌తో ఫైట్ చేసిన బాలయ్య, సీక్వెల్లో ఆది పినిశెట్టితో తలపడనున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. బిగ్ స్క్రీన్‌పై వీళ్లిద్దరి యాక్షన్ సీన్స్ చూడాలని ఆత్రుతగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హిట్ కాంబో
కాగా, అల్లు అర్జున్- బోయపాటి కాంబోలో 2016లో వచ్చిన ‘సరైనోడు’లోనూ ఆది పినిశెట్టి విలన్ క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమాలో హీరో బన్నీతోపాటు ఆదికి కూడా సమానంగా ఎలివేషన్స్ సీన్స్ ఉంటాయి. ఆది నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ లెక్కన అఖండ 2 కోసం కూడా ఆదికి బోయపాటి శక్తిమంతమైన పాత్రే రాసి ఉంటారు!
ఈ సీక్వెల్ విషయానికిస్తే, యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ హీరోయిన్గా నటించనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇక 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పకురాలు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంచలన విజయం సాధించిన ‘అఖండ’కి దీటుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా 2025 సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శివరాత్రికి ‘అఖండ 2’ టీమ్ స్పెషల్ సర్ప్రైజ్
‘డాకు మహారాజ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ‘అఖండ 2 : తాండవం’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ బాలయ్య అభిమానుల కోసం ఓ స్వీట్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నారట.
త్వరలోనే ఈ సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల చివరిలో ఆ లుక్‌ను రివీల్ చేసే ప్లాన్స్‌లో ఉన్నట్లు సినీ వర్గాల మాట. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, ‘అఖండ’కు సీక్వెల్‌గా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బాలయ్య మరో నయా అవతార్‌లో కనిపించనున్నారట. రెండు భిన్నమైన పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్యతో పాటు సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబరు 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
హ్యాట్రిక్ హిట్స్
జనవరి 12న విడుదలైన ‘డాకు మహారాజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్యకు ఇది వరుసగా నాలుగో హిట్ కావడం విశేషం.
హిట్ కాంబో :
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న నాలుగో చిత్రం ‘అఖండ-2’. ఈ ఇద్దరూ ఇప్పటికే ‘లెజెండ్’, ‘సింహా’, ‘అఖండ’ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ‘అఖండ 2’పైన భారీ అంచనాలే ఉన్నాయి. పైగా బోయపాటి ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్, అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో తీర్చిదిద్దుతున్నారు.
AKHANDA 2 UPDATE-అఖండ 2′ హీరోయిన్ ఫిక్స్- మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్
‘టాలెంటెడ్ నటి సంయుక్తకు అఖండ 2 ప్రాజెక్ట్‌లోకి స్వాగతం. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది’ అని మేకర్స్ పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, వరుస హిట్లుతో దూసుకెళ్తున్న టాలీవుడ్ యంగ్ లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ కోసం బోయపాటి శక్తివంతమైన మహిళా పాత్రను రాసినట్లు తెలుస్తోంది. కాగా, అఖండ-2లో ప్రగ్యాతో పాటు సంయుక్తకు కూడా సందడి చేయనున్నారు.
హిట్ కాంబోలో నాలుగో సినిమా
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రం అఖండ-2. వీరి కాంబోలో ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు తెరకెక్కి భారీ హిట్లు కొట్టాయి. దీంతో ఈ సినిమాను దర్శకుడు బోయపాటి ఫుల్ యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

అఖండకు సీక్వెల్!
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పకురాలు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంచలన విజయం సాధించిన ‘అఖండ’కి దీటుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా 2025 సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హ్యాట్రిక్ హిట్స్
నట సింహం బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ మూవీ జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్యకు వరుసగా నాలుగో హిట్. వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్య ‘అఖండ-2’ తో విజయపరంపర కొనసాగించాలని భావిస్తున్నారు
మహా కుంభమేళాలో ‘అఖండ 2’ టీమ్ – కోట్లాది భక్తుల మధ్యలో షూటింగ్
‘మహా కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాది అఘోర నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ఇక్కడ షూట్ చేస్తున్నాం. అఘోర, నాగ సాధువులను కూడా కలిశాం. 11వ తారీకు నుంచే మేం ఇక్కడ ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. ఇన్ని కోట్ల మందిలో కూడా మా ప్రయత్నంలో లోపం లేకుండా షూటింగ్ కొనసాగిస్తున్నాం’ అని బోయపాటి పేర్కొన్నారు. ఇక కోట్లాది మంది భక్తుల మధ్యలో షూటింగ్ అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘థియేటర్లలో పూనకాలే’ అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
నాలుగో సినిమా
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రమిది. వీరి కాంబోలో ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను దర్శకుడు బోయపాటి ఫుల్ యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంచలన విజయం సాధించిన ‘అఖండ’కి దీటుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా 2025 సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘అఖండ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ – బాలయ్య డైలాగ్‌తో కొత్త ప్రోమో అదిరింది
వచ్చే ఏడాది 2025 దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.ఈ రిలీజ్ డేట్ ప్రోమోలో బాలయ్య సినిమా లాంఛ్ సమయంలో చెప్పిన డైలాగ్‌ను చూపిస్తూ, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ప్లే చేసింది. ఇంకా ఈ వీడియోలో శివుడి తాండవం చేస్తున్నట్లు విజువల్స్‌ను గ్రాఫిక్స్ రూపంలో చూపించింది. ఇప్పటికే బాలయ్య మొదటి భాగంలో శివ భక్తుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో భాగంలోనూ ఆయన శివ భక్తుడిగా , మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
పైగా నిజ జీవితంలోనూ బాలయ్య సంప్రదాయాలకు ఎంత విలువనిస్తారో తెలిసిందే. ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ. ఇప్పుడు అఖండ 2లో అలానే కనిపించనున్నారు. ఆచారాల కోసం పోరాడే, దేవాలయాలను, వాటి పవిత్రతను కాపాడే పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పవర్ఫుల్ పాత్రకు బోయపాటి శక్తివంతమైన డైలాగులు రాస్తున్నారట.
కాగా, ‘అఖండ 2’ సినిమా విషయానికి వస్తే, బాలయ్య బోయపాటి కాంబోలో వస్తోన్న 4వ సినిమా ఇది. సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించనునన్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ థీమ్‌కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది విన్న నందమూరి ఫ్యాన్స్ టైటిల్‌కే ఈ రేంజ్లో ఇచ్చారంటే సినిమాకు ఏ రేంజ్లో ఇస్తారో, పూనకాలే అంటూ అంచనాలు పెంచేసుకున్నారు.