Allu Arjun Rejected Blockbuster Movies : అల్లు అర్జున్ వదులుకున్న మూడు ఇండస్ట్రీ హిట్లు ఏవో తెలుసా..?
Allu Arjun Rejected Blockbuster Movies : అల్లు అర్జున్న ఎంత మెగా ఫ్యామిలీ హీరోగా వచ్చినా కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి సినిమాలో తన నటన, ట్యాలెంట్ ను చూపిస్తూ అదరగొట్టాడు. ఒక్కో సినిమాతో ఒక్కో స్టైల్ ను పరిచయం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. మొదట్లో ఆయన్ను చూసి విమర్శించిన వారే హీరో అంటే ఇలాగే ఉండాలి అంటూ సలాం కొట్టే దాకా ఎదిగాడు బన్నీ. అందుకే ఆయన సినిమాలతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అలాంటి బన్నీ తన కెరీర్ లో కూడా చాలా నే సినిమాలను వదులుకున్నాడు. అందులో చాలావరకు బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఉన్నాయి.
అందులో మొదటగా చెప్పుకోవాల్సింది అర్జున్ రెడ్డి. ఈ సినిమా కథను ముందుగా సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ కు వినిపించాడు. కానీ బన్నీ ఇలాంటి కథ తనకు సెట్ కాదని వదిలేసుకున్నాడు. కానీ ఇదే సినిమాతో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. అలాంటి సినిమాను ఒక వేళ అల్లు అర్జున్ చేసి ఉంటే కథ వేరే విధంగా ఉండేదేమో అంటున్నారు ఆయన అభిమానులు.
అప్పట్లో బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం అయిన భద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా కథను ముందుగా అల్లు అర్జున్ కే వినిపించాడు బోయపాటి శ్రీను. అయితే ఎందుకో కథ నచ్చక బన్నీ రిజెక్ట్ చేశాడు. కానీ అదే కథతో రవితేజ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రవితేజ కెరీర్ లో ఆ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయిందంటే ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక సెన్సేషనల్ మూవీ గీతా గోవిందం కూడా ముందు బన్నీ వద్దకే వచ్చింది. పరశురాం ఈ కథను ముందు బన్నీకి వినిపించాడు. కానీ ఈ సినిమా కథను కూడా బన్నీ ఎందుకో రిజెక్ట్ చేశాడు. ఒక హీరోయిన్ వెనకాల తిరిగితే తన ఇమేజ్ కు సెట్ కాదని బన్నీ దాన్ని వదిలేశాడు. దాంతో అదే కథతో విజయ్ దేవరకొండ మరోసారి అద్భుతమైన ఛాన్స్ కొట్టేశాడు. ఇంకేముంది ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
సుకుమార్ ఏ కథ రెడీ చేసినా ముందు బన్నీకే చెబుతాడు. ఈ క్రమంలోనే 100 %లవ్ సినిమా కథను కూడా ముందు బన్నీకే చెప్పాడు సుకుమార్. కాకపోతే ఎందుకో బన్నీ ఈ కథను రిజెక్ట్ చేశాడు. అదే కథతో చైతూతో సినిమా చేసి మంచి క్లాసిక్ హిట్ కొట్టాడు సుకుమార్. ఇలా ఇండస్ట్రీలో చాలా వరకు హిట్ సినిమాలను వదులుకున్నాడు అల్లు అర్జున్.