Best AI Tools You Should Try : భవిష్యత్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌దే అని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం మీరు ప్రత్యేకంగా ఏఐ కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సిద్ధం చేసిన కొన్ని లేటెస్ట్ యాప్స్‌ను వాడుకోవచ్చు. వీటితో మీకు నచ్చిన విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఇలాంటి ఏఐ టూల్స్ వాడాలని ఉందా? మరెందుకు ఆలస్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్-20 ఏఐ టూల్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
- Pally :చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు అప్లోడ్ చేస్తుంటారు. వాటికి సరైన క్యాప్షన్స్ ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి ‘పాలీ’ (Pally) ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే? ముందుగా మీరు పాలీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మీ ఫొటోను అప్లోడ్ చేయాలి. అంతే సింపుల్. పాలీ ఏఐ టూల్ మీ ఫొటోను అనలైజ్ చేసి, మంచి క్యాప్షన్‌ను జనరేట్ చేస్తుంది. దానిని కాపీ చేసి, మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయండి.
- Moises :ఈ మోసిస్ ఏఐ టూల్ ఉపయోగించి, ఆడియోలోని వాయిస్, డ్రమ్స్, బేస్‌లను రిమూవ్ చేయవచ్చు. లేదా వాయిస్‌ను అలానే ఉంచి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను తీసేయవచ్చు. అంతేకాదు వాయిస్ క్లోనింగ్ కూడా చేసుకోవచ్చు.
- GITA GPT :మీకు భగవద్గీత చదవాలని ఉందా? లేదా భగవద్గీతకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే మీరు సంస్కృతంలోని భగవద్గీతను పూర్తిగా చదవాల్సిన పనిలేదు. ‘గీతా జీపీటీ’ ఏఐ టూల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే? ముందుగా మీరు గీతా జీపీటీని ఓపెన్ చేసి, భగవద్గీతకు సంబంధించి మీకు ఉన్న ప్రశ్నను టైప్ చేయాలి. అంతే సింపుల్! వెంటనే మీకు సరైన సమాధానం వస్తుంది.
- Super Meme AI :
ఈ టూల్‌తో చాలా ఈజీగా మీమ్స్ తయారు చేసుకోవచ్చు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి, మీ యూజర్లను చక్కగా ఆకట్టుకోవచ్చు.
- Chef GPT :ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించి, మీకు నచ్చిన ఆహార పదార్థాల రెసిపీ తెలుసుకోవచ్చు. అలాగే దానిని ఎలా వండాలో కూడా నేర్చుకోవచ్చు. పైగా మీరు తింటున్న ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు.
- Wisely :ఈ వైజ్లీ ఏఐ టూల్ ఉపయోగించి ఒర్జినల్, డూప్లికేట్ డివైజ్‌లను సులువుగా గుర్తించవచ్చు. ఎలా అంటే, మీరు ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలని అనుకుంటే, దాని వివరాలను ఈ వైజ్లీ ఏఐ టూల్లో పేస్ట్ చేయండి. వెంటనే సదరు డివైజ్ సరైనదా? నకిలీదా? అనేది మీకు తెలుస్తుంది.
- Pop AI :మీ దగ్గర ఒక పాఠానికి సంబంధించిన పీడీఎఫ్ ఉంది అనుకుందాం. దానిని మీరు ఈ పాప్ ఏఐ టూల్లో అప్లోడ్ చేయాలి. దాని తరువాత దానికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు వస్తే, వెంటనే మీకు తగిన సమాధానాలు ఇస్తుంది. దీనిని ఉపయోగించి, మీ అకడమిక్ స్టడీస్‌కు సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
- Luma AI :ఈ లూమా ఏఐ టూల్ ఉపయోగించి మీ సాధారణ వీడియోను 3డీ మూవీగా మార్చేయవచ్చు.
- Trip Club :ట్రావెలింగ్ అంటే ఇష్టపడే వారికి ఈ ట్రిప్ క్లబ్ ఏఐ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే? ముందుగా మీరు వెళ్లాలని అనుకుంటున్న లొకేషన్ పేరును ట్రిప్ క్లబ్లో ఎంటర్ చేయాలి. అలాగే మీరు ఏయే తేదీల్లో అక్కడకు వెళ్లాలని అనుకుంటున్నారో చెప్పండి. అంతే మీకు సరిపోయే మంచి టూర్ ప్లాన్‌ను ట్రిప్ క్లబ్ అందిస్తుంది.
- Rows AI :ఈ రోస్ ఏఐ టూల్ అనేది మీ Excel షీట్‌లోని డేటాను అనలేజ్ చేసి, మీకు కావాల్సిన సమాచారాన్ని బ్రీఫ్ సమ్మరీగా అందిస్తుంది.
- Trickle :ఈ ట్రికెల్ ఏఐ టూల్ అనేది స్క్రీన్షాట్లను అనలేజ్ చేసి, మీకు కావాల్సిన సమాధానాలను అందిస్తుంది. కనుక దీనిని ఉపయోగించి మీకు నచ్చిన ష్క్రీన్షాట్లోని వివరాలు తెలుసుకోవచ్చు.
- Durable :చిన్నచిన్న బిజినెస్‌ల కోసం సొంత వెబ్సైట్ నిర్మించాలని అనుకునేవారికి డ్యూరబుల్ ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి కేవలం కొన్ని నిమిషాల్లో మీకు నచ్చిన వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
- Summarist AI :ఈ సమ్మెరెస్ట్ ఏఐ టూల్ ఉపయోగించి ఓ పెద్ద పుస్తకంలో ఉన్న మొత్తం విషయాన్ని సమ్మరీ రూపంలో తెలుసుకోవచ్చు.
- 3D Daily :దీనిని ఉపయోగించి 3డీ చిత్రాలను రూపొందించవచ్చు. పక్కాగా ప్లాన్ చేస్తే, వీటిని ఉపయోగించి సినిమా కూడా తీసేయవచ్చు.
- Suno AI :ఈ సునో ఏఐ టూల్ ఉపయోగించి మంచి ఆడియా సాంగ్స్ క్రియేట్ చేయవచ్చు. దీని కోసం మీరు లిరిక్స్ రాసుకొని, దానిలో అప్లోడ్ చేయాలి. తరువాత మీకు ఎలాంటి సంగీతం కావాలో చెప్పాలి. అంతే సింపుల్. మీరు కోరుకున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాట రెడీ అయిపోతుంది.
- Voicify AI :ఈ వాయిసీఫై ఏఐ టూల్ ఉపయోగించి, మీకు నచ్చిన సెలబ్రిటీ వాయిస్లాగా మీ వాయిస్‌ను మార్చుకోవచ్చు.
- Autodraw AI :ఈ ఆటోడ్రా ఏఐ టూల్ ఉపయోగించి, మీకు నచ్చిన బేసిక్ డ్రాయింగ్లను వేసుకోవచ్చు. పూర్తిగా డ్రాయింగ్ చేయలేనివారు ఈ టూల్ ఉపయోగించి, తమ మనస్సులోని భావాలను డ్రాయింగ్ రూపంలోకి మార్చుకోవచ్చు.
- Jellipod :దీనిని ఉపయోగించి చాలా సింపుల్ పాడ్‌కాస్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.
- Tidal Flow :ఈ టైడల్ ఏఐ టూల్ అనేది మీకు ఒక పర్సనల్ ట్రైనర్లాగా పనిచేస్తుంది. ఇందులో మీ శరీర కొలతలు, మీ ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాలు ఇస్తే, మీకు ఎలాంటి వ్యాయామాలు అయితే మంచిదో తెలుపుతుంది.
- Microsoft Copilot :ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉపయోగించి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. కమాండ్స్ ఇచ్చి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే ఉచితంగా లభిస్తున్న పర్సనల్ అసిస్టెంట్ లాంటిది ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్.