Bhamakalapam 2 : భామాకలాపం సినిమా 2022లో రిలీజ్ అయ్యే చాలామందిని ఆకట్టుకుంది.ఇదొక డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్.
Bhamakalapam 2 : ఇందులో ప్రియమణి, కిషోర్, జాన్ విజయ్, శాంతిరావు, శరణ్య ప్రదీప్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు.అభిమన్యు తాడిమేటి కథ అందించడమే కాక ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.“భామాకలాపం” ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక వెబ్ ఫిల్మ్ గా రిలీజ్ అయింది.దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో భామాకలాపం 2( Bhamakalapam 2 ) పేరిట ఓ సీక్వెల్ కూడా తీశారు.
ఇది ఫిబ్రవరి 16న రిలీజ్ అయింది ఇందులో కూడా ప్రియమణి మెయిన్ రోల్ చేసింది.అభిమన్యు దర్శకత్వం వహించాడు.అయితే ఈ సినిమా తర్వాత భామాకలాపం 3 కూడా తీస్తున్నట్లు హింట్ ఇచ్చారు.దీనివల్ల ఇది ఒక మూవీ సిరీస్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు.
సాధారణంగా వెబ్ సిరీస్ అనగానే అందులో బూతులు, అడల్ట్ సీన్లు, వెకిలి చేష్టలు, రోత సీన్లు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి కానీ భామాకలాపం పార్ట్ 1 & 2 సినిమాల్లో ఒక్క అసభ్య పదం కూడా వాడలేదు.అశ్లీలత ఎక్కడా కనిపించలేదు.కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు.ఈ సినిమాలు రెండు పెద్దగా బోర్ కూడా కొట్టించవు.వీకెండ్ లో వీటిని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.కామెడీ, మర్డర్ల మిస్టరీ, థ్రిల్లింగ్ దొంగతనాలతో ఈ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి.
మూవీ ఫస్ట్ పార్ట్ డార్క్ కామెడీ జానర్లో రాగా.సెకండ్ పార్ట్ హీస్ట్ థ్రిల్లర్ జానర్లో వచ్చింది.రెండు సినిమాల్లోనూ ప్రియమణి ( Priayamani )అద్భుతంగా నటించి వావ్ అనిపించింది.శరణ్య ప్రదీప్( Saranya ) నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది.వారిద్దరి ఆకట్టుకునే నటనా ప్రదర్శన వల్లే ఈ రెండు సినిమాలు జనాలను మొబైల్, టీవీ స్క్రీన్ లకు కట్టిపడే సాయి.
ఈ సినిమాలో హీరోయిజం ఎక్కడా కనిపించదు, కథే ఇందులోని అసలైన హీరో.ఏ పాత్రకి ఇందులో ప్రాధాన్యత ఉండదు, కథ ప్రకారం మూవీ నడుస్తూ వెళ్తుంది.ఒక కొత్త మూవీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ రెండు సినిమాలు ఉత్తమంగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు.
వెబ్ మూవీలు, సిరీస్ లు ఎలా తీయాలో చెప్పడానికి ఈ రెండు సినిమాలు మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి.
also read-Deepika Remuneration for Kalki 2898AD