Brahmanandam : తెరపై ఆయన కనిపిస్తే నవ్వులు హరివిల్లు పూయాల్సిందే. అసలు కామెడీ అంటేనే ఆయన.. ఆయన అంటేనే కామెడీ.. అనేంతలా గుర్తంపు సాధించుకున్నారు. కేవలం ఆయన కామెడీ వల్లనే ఆడిన సినిమాలు కొన్ని వందలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆయన నవ్వినా, కోప్పడినా.. కవ్వించినా.. చివరకు ఏడ్చినా సరే కామెడీగానే ఉంటుంది. అందుకే దర్శకులు ఏరికోరి మరీ ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించేవారు. చాలా మంది కమెడియన్లను పాత్రల కోసం తీసుకుంటారు. కానీ బ్రహ్మానందాన్ని మాత్రం సినిమా కోసమే తీసుకుంటారు. సినిమా హిట్ కావాలంటే ఆయన కామెడీ ఉండాల్సిందే. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే బ్రహ్మానందం.
Brahmanandam : బ్రహ్మానందం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎలాంటి పాత్రకు అయినా ప్రాణం పోసేంతగా నటిస్తుంటారు. ఆయన ఒక పాత్ర చేశారంటే ఆ పాత్ర మాత్రమే మనకు గుర్తుకు వస్తుంది తప్ప.. అందులో బ్రహ్మానందం మనకు ఎక్కడా కనపించడు. ఆయన కేవలం కమెడియన్ గానే కాకుండా థియేటర్, మిమిక్రీ ఆర్టిస్ట్ గాను, అలాగే రచయిత, చిత్రకారుడుగాను రాణించాడు. లెక్చరర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. సినిమాలపై ఉన్న పిచ్చితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవి సినిమా చూసేందుకు వెళ్లి ఆయన కంట్లో పడ్డాడు. అప్పటి నుంచి చిరంజీవి బ్రహ్మానందాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించాడు.
లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల బ్రహ్మానందంను వెండితెరకు పరిచయం చేశాడు. చిరంజీవితో చేసిన కామెడీ చిత్రం చంటబ్బాయి మూవీలో చిన్న పాత్ర చేశాడు. కానీ ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం 1987లో విడుదలైన అహ నా పెళ్ళంట. ఈ మూవీ తర్వాత బ్రహ్మానందం వెనక్కు తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలు, చిన్న హీరోలు, సీనియర్లు, జూనియర్లు అంటూ ఇలా తేడా లేకుండా అందరి సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ఒకానొక సమయంలో హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కమెడయిన్ బ్రహ్మానందమే.
అలాంటి ఆయన దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నాడు. ఆయనకు జూబ్లీహిల్స్ లో ఓ లగ్జరీ ఇల్లు ఉంది. దాంతో పాటు హైదరాబాద్ శివార్లలో రెండు గెస్ట్ హౌస్ లు కూడా ఉన్నాయి. ఆయన మొదటి నుంచి తన సంపాదన మొత్తం రియల్ ఎస్టేట్ లో పెడుతూ వచ్చాడు. అలా దాదాపు కొన్ని వందల ఎకరాలు కొన్నాడు.
దాంతో పాటు ఆయనకు చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. దాంతో ఆయన ఆస్తులు వందల కోట్లకు చేరుకున్నాయి. ఇక బ్రహ్మానందంకు ఆడీ క్యూ 7, ఆడీ క్యూ 8, బెంజ్ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్తుల విలువ మొత్తం రూ.500 కోట్లకు పై చిలుకు ఉన్నాయి.
also read-అత్తారింట్లో తొలిసారి హల్వా ప్రిపేర్ చేసిన కొత్త పెళ్లికూతురు రకుల్ ప్రీత్ సింగ్…!