charlapalli railway station-హైదరాబాద్ నగరానికి తూర్పున చర్లపల్లి కొత్త రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
charlapalli railway station-సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్) స్టేషన్లు వందేళ్ల క్రితం నిర్మించినవి. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇన్నేళ్లకు అంతపెద్ద స్థాయిలో ఒక టెర్మినల్ అందుబాటులోకి రావడం చర్లపల్లిలోనే అని రైల్వే అధికారులు చెబుతున్నారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల అంచనా వ్యయంతో మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ వ్యయం సుమారు రూ.430 కోట్లకు చేరుకుంది.

సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడానికి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను పునర్నిర్మించారు. సికింద్రాబాద్‌లో ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 236 రైళ్లు వచ్చిపోతుంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే 12 రైళ్లకు చర్లపల్లిలో హాల్టు కల్పిస్తున్నారు.

చర్లపల్లి రైల్వేస్టేషన్లో ప్రస్తుతం 13 రైళ్లకు హాల్టు సౌకర్యం ఉంది. కొత్త ట్రాకులు, ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తే అదనంగా 15 రైళ్లు నిలిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. చర్లపల్లి టెర్మినల్‌ను లక్ష మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్లుగా తీర్చిదిద్దారు.

చర్లపల్లిలో గతంలో తొమ్మిది ట్రాకులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యను రైల్వేశాఖ 19కి పెంచింది. అలాగే ఐదు ప్లాట్‌ఫాంలను తొమ్మిదికి పెంచారు. స్టేషన్ అవరణలో దాదాపు 5500 మొక్కలు పెంచుతున్నారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను విమానాశ్రయం తరహాలో నిర్మించారు. విశాలమైన పార్కింగ్, రహదారులు, సూచిక బోర్డులు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, దివ్యాంగులకు ర్యాంపులు, బుకింగ్ కౌంటర్, ఆటోలు, ట్యాక్సీలు, బస్సులకు ప్రత్యేక బే (మార్గం), డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు.

హెల్ప్ డెస్క్, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ప్రయాణికుల లాంజ్‌లు, బేబీ ఫీడింగ్ రూములు అందుబాటులో ఉన్నాయి. పై అంతస్తులో కెఫేటేరియా, ఫుడ్ కోర్టులకు స్థలం కేటాయించారు.

ఇకపై కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచే ప్రారంభించి, అక్కడే ఆపడానికి వీలుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. రైళ్ల నిర్వహణకు నాలుగు పిట్ లైన్లు నిర్మించారు. ఇక్కడ వాషింగ్, సేఫ్టీ చెక్ చేస్తారు. ఇంటర్మీడియటరీ ఓవర్ హాలింగ్ షెడ్ (ఐఓఎస్) నిర్మించారు. ఇక్కడ రైల్వే కోచ్‌లకు అవసరమైన మరమ్మతులు చేస్తారు.

చర్లపల్లిలో తొమ్మిది ప్లాట్‌ఫాంలను కలుపుతూ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒకవైపు మెట్లు, మరోవైపు ఎస్కలేటర్ సదుపాయం ఉంటుంది. ప్రధాన భవనంతో అనుసంధానంగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి 12 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పికప్ అండ్ గో ప్రాంతం నుంచి మొదలయ్యే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆరు మీటర్ల వెడల్పుతో ఉంటుంది.

అయితే ఈ స్టేషన్‌కు చేరుకునేందుకు రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, మహాలక్ష్మి నగర్, భరత్ నగర్ వైపు ఉన్న రోడ్లను 80-100 అడుగులకు విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకునేందుకు ప్రజారవాణా సదుపాయాలు తగినన్ని అందుబాటులో లేవని ప్రయాణికులు చెబుతున్నారు. ఆటో, ట్యాక్సీల్లోలాంటి ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి వస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం కల్పించాల్సి ఉంది.

ఎంఎంటీఎస్ రెండో దశ కింద ఇక్కడికి రైళ్ల సంఖ్య మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
also read-GOLD RATE TODAY-దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి…!
అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉదయం వర్చువల్‌గా స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. రూ.413 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మించగా.. సికింద్రాబాద్‌కు బదులుగా ఇకపై చాలా ట్రైన్లు అక్కడే హాల్టింగ్ తీసుకోనున్నాయి. కాగా, రెండు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల ప్రారంభ స్టేషన్‌ను నూతన టెర్మినల్ చర్లపల్లికి మారుస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం మార్చి నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు.
చెన్నై సెంట్రల్- హైదరాబాద్- చెన్నై సెంట్రల్ ( ట్రైన్ నెంబర్ 12603/12604) ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టెర్మినల్‌ను నాంపల్లి స్టేషన్‌కు బదులుగా చర్లపల్లికి మార్చారు. ఈ నిర్ణయం మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గోరఖ్‌పుర్- సికింద్రాబాద్- గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 12589/12590) టెర్మినల్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మార్చారు. ఈ నిర్ణయం మార్చి 12 నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు ఈ ట్రైన్లలో జర్నీలు సాగించేందుకు ప్రసత్తం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లకు వస్తున్నారు. అయితే నగరంలో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో స్టేషన్లకు చేరుకోవటం, స్టేషన్ల నుంచి జిల్లాలకు వెళ్లటం కష్టతరంగా మారుతోంది. ఉక నుంచి ఆ టెన్షన్ లేకుండా హైదరాబాద్ శివారు చర్లపల్లి స్టేషన్ నుంచే రాకపోకలు సాగించే వీలు కలగనుంది.
ఇదే కాకుండా మరో మూడు ట్రైన్లకు చర్లపల్లిలో స్టాపేజీ ఇస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు ట్రైన్లను చర్లపల్లి టెర్మినల్‌లో స్టాపేజీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు. సికింద్రాబాద్-సిర్పూర్కాగజ్నగర్ ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 12757) ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుందని.. 8.32కి చర్లపల్లికి చేరుకుని ఒక నిమిషం స్టేషన్లో ఆగుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12757) చర్లపల్లికి రాత్రి 7.02 గంటలకు చేరుకుంటుందని చెప్పారు.
సికింద్రాబాద్-సిర్పూర్కాగజ్నగర్ ( ట్రైన్ నెంబర్ 17233) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 3.47కి, సిర్పూర్కాగజ్నగర్-సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్ 17234) ఉదయం 9.20కి చర్లపల్లి టెర్మినల్‌లో ఆగనున్నాయని చెప్పారు. గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 17201) చర్లపల్లి టెర్మినల్‌లో మధ్యాహ్నం 12.41కి, సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 17202) మధ్యాహ్నం 12.50కి చర్లపల్లి టెర్మినల్‌లో ఆగుతాయని వెల్లడించారు.
ఇప్పటికే చిన్న చిన్న పనులు మినహా రైల్వేస్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తవగా.. తుది మెరుగులు దిద్దుతున్నారు. అవి కూడా పూర్తయితే.. త్వరలోనే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. కానీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీలుచూసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇప్పటికే.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్.. స్టేషన్‌ను పరిశీలించారు.
మరోవైపు.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను చేరుకునేలా ప్రభుత్వ.. రోడ్లను విస్తరించే పనులను కూడా చేపట్టింది. ప్రస్తుతం ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేలా.. 12 రైళ్లు ఈ స్టేషన్లో ఆపేలా రైల్వేబోర్డు నుంచి అనుమతులు లభించాయి. ప్రారంభించటమే తరువాయి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే రెడీగా ఉంది. అయితే.. ఈ రైల్వేస్టేషన్ నుంచి ఏ ఏ రైళ్లు నడుపనున్నారన్న వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించకపోయినా.. నడిచే రైళ్లు, ఆపే రైళ్ల జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
చర్లపల్లి నుంచి నడవబోతున్న రైళ్లు
- 12589/12590 గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ – గోరఖ్ పూర్
- 12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- 12604 హైదరాబాద్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- 18045 షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
- 18046 హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
చర్లపల్లి స్టేషన్లో ఆగే రైళ్ల వివరాలు
- 12705/12706 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్
- 17011/17012 హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- 12757/12758 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
- 17201/17202 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్
- 17233/17234 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
- 12713/123714 విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్