Devara Movie OTT : దేవర పార్ట్ 1 ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఈ సినిమా ఎప్పట్నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందంటే?
Devara Movie OTT : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ ‘దేవర పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. సెప్టెంబర్ 27న రీలీజైన ఈ మూవీ ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.500+ కోట్ల వసూళ్లు సాధించింది. మూడు వారాల నుంచి ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దసరా తర్వాత కూడా లాంగ్ రన్లో దూసుకుపోతోంది. దీంతో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ, దేవర సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా 2024 నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి పాన్ఇండియా రేంజ్లో రిలీజైన మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుందో కూడా తెలియాల్సి ఉంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ దీన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీపావళి కంటే ముందే ఈ సినిమా రిలీజై నాలుగు వారాలు కంప్లీట్ చేసుకుంటుంది. దీంతో దీపావళి సందర్భంగానూ ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక దేవర ముందుగా షెడ్యూల్ చేసుకున్న ప్రకారమే వస్తుందా? లేదా దీపావళికి రీలీజ్ చేస్తారా అని చూడాలి.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో హై లెవెల్ గ్రాఫిక్స్‌తో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్లో కనిపించి అభిమానులను అలరించారు.
‘దేవర’లో సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ సంగీతం అందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కింది. దేవర-1 భారీ హిట్ అవ్వడం వల్ల దాని సీక్వెల్ పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.
Devara : రికార్డులు కొల్లగొడుతోన్న దేవర.. షాకింగ్ అప్డేట్..!
రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయిన 18 రోజుల్లోనే రూ.276.15 కోట్లు రాబట్టింది.