HanuMan : హను-మాన్ ప్రిరిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చేయాలో తెలుసా…
HanuMan : టాలీవుడ్లో సినిమా.. సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన ’జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలకానుంది. ప్రచార చిత్రాలతో ఓ రేంజ్లో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం : 7.15 కోట్లు, సీడెడ్ : 4 కోట్లు, ఆంధ్రా : 9.50 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తం : 20.65 కోట్లు, కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా : 2 కోట్లు, ఓవర్సీస్ : 4 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్‌గా 26.65 కోట్లుగా ఉంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.50 కోట్లుగా ఉండనుంది. ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే.. తెలంగాణలో టిక్కెట్ రేట్లు ఇలా ఉండనున్నాయి. మల్టీప్లెక్స్‌లు – ₹295, హైదరాబాద్ సిటీ సింగిల్ స్క్రీన్లు ₹150, హైదరాబాద్ సిటీ మినహా రాష్ట్రంలోని అన్ని చోట్లా 110 రూపాయలుగా ఉండనుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. భగవాన్ హనుమంతుడి ద్వారా అతీత శక్తులు పొందిన యువకుడికి.. లోకాన్ని నాశనం చేయాలనే దుష్ట శక్తులను ఎలా వినాశనం చేసాడనేదే ఈ సినిమా స్టోరీ. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్ ఉంది. గ్రాఫిక్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడిని చూపించిన విధానం ఆకట్టుకుంది పరమ పవిత్రమైన రామ జన్మభూమిలో భగవాన్ శ్రీరాముడి భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తై పూజలు అందుకుంటున్న వేళలో ఈ సినిమా రావడం ఆసక్తి రేకిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ సహా పలు విదేశీ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బజ్ కూడా సినిమాకు అనుకూలంగా ఉంది. చూడాలి మరి భారతీయ ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకోనుందో.
ఇక ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. అనుదీప్ దేవ్, జయక్రిష్, హరి గౌర, కృష్ణ సౌరభ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఆంజనేయ దండకం సహా పలు పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. అంతేకాదు ఈ సినిమా చిరంజీవి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.