Heroines as Politicians In Movies : సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. చాలా మంది సినీ తారలు పాలిటిక్స్‌లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. వారిలో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం బోల్తా పడ్డారు. అయితే ఇప్పుడు దేశంలో ఎన్నికల ఫీవల్ మొదలైంది. రాబోయే రెండు నెలల్లో ఎక్కడ చూసినా ఎన్నికల మాటలే వినపించనున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై రాజకీయ రంగు వేసుకున్న, అదే పొలిటీషియన్లుగా నటించిన హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
- కంగనా రనౌత్ – తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్ ఆధారంగా వచ్చిన చిత్రాల్లో తలైవి కూడా ఒకటి. ఇందులో కంగనా రనౌత్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.
- అనసూయ – విలక్షన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ పెదకాపు 1 చిత్రంలో పొలిటీషియన్‌గా నటించి మెప్పించింది.
- త్రిష- ధనుశ్ నటించిన ధర్మయోగి చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పొలిటీషియన్‌గా కనిపించింది.
- నయనతార – చిరంజీవి గాడ్ ఫాదర్‌లోనూ నయనతార రాజకీయ నాయకురాలిగా కనిపించింది.
- కేథరిన్ – సరైనోడు చిత్రంలో యూ ఆర్ మై ఎమ్మెల్యే అంటూ గ్లామర్ పొలిటీషియన్‌గా కేథరిన్ మంచి క్రేజ్ దక్కించుకుంది.
- ప్రియమణి – నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రంలో సీఎంగా గెలవాలని కుట్రలు చేసే రాజకీయ నాయకురాలిగా ప్రియమణి నటించి ఆకట్టుకుంది.
- కృతిశెట్టి – చైతన్య బంగార్రాజు చిత్రంలో సర్వంచ నాగలక్ష్మీగా కనిపించి ఆకట్టుకుంది.
- వరలక్ష్మీ శరత్ కుమార్ – విజయ్ దళపతి సర్కార్ సినిమాలో విలన్‌గా, రాజకీయ నాయకురాలిగా కనిపించింది.
- రమ్యకృష్ణ – ఈమె మూడు చిత్రాల్లో రాజకీయ నాయకురాలిగా కనిపించింది. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్ క్వీన్ వెబ్ సిరీస్, మహేశ్ బాబు గుంటూరు కారంలో న్యాయ శాఖమంత్రిగా కనిపించింది.
- రోజా- రియల్ లైఫ్‌లోనూ రాజకీయనాయకురాలైన ఈమె మొగుడు చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దీనికి దర్శకుడు.
- రవీనా టాండన్ – కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్ 2లో ఈమె ప్రధాన మంత్రి పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
- శ్రియా – పవిత్ర సినిమాలో పొలిటీషియన్‌గా కనిపించి ఆకట్టుకుంది.