Joker 2 Movie : హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోకర్ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’ (Joker: Folie à Deux) అంటూ ఈ సినిమా రానుండగా.. టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది.
Joker 2 Movie : హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోకర్ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’ (Joker: Folie à Deux) అంటూ ఈ సినిమా రానుండగా.. టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. జోక్విన్ ఫీనిక్స్‌తో పాటు పాప్‌స్టార్ లేడీగాగా కనిపించి అలరించారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ గమనిస్తే.. జైల్లో ఉన్న జోకర్‌కి లేడిగాగా పరిచయం అవుతుంది. వీళ్ల పరిచయం ప్రేమగా ఎలా మారింది. ఆ తర్వాత ఏం జరిగింది అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ సంగీత నేపథ్యంలో రానున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం అక్టోబరు4, 2024న థియేటర్లలోకి రానుంది.
2021లో వచ్చిన జోకర్ (Joker) సినిమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డీసీ కామిక్స్‌లో భాగంగా మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను జోక్విన్ ఫీనిక్స్ (Joaquin Phoenix) ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాకు ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’ (Joker: Folie à Deux) పేరిట సీక్వెల్ వస్తుంది.
ALSO READ-Sobhita Dhulipala : వేశ్యగా మారిన తెలుగు హీరోయిన్ – ఫుల్ హ్యాపీ అంటూ కామెంట్స్..!