Prabhas Kannappa Look : మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. భారీ తారాగణంతో రూపొందుతున్న ఆ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం తాజాగా పోస్టర్ షేర్ చేసింది. రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని చెప్పింది. “ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు!! శివాజ్ఞ పరిపాలకుడు!!!” అని టీమ్ పేర్కొంది. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Prabhas Kannappa Look :అయితే మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా కన్నప్ప సినిమా సిద్ధమవుతోంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిందీ మహాభారత సిరీస్‌ను తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
Prabhas Kannappa Look : భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ప్రభాస్- నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపించింది. అయితే కాజల్ పార్వతీదేవిగా కనిపిస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
అయితే కన్నప్ప చిత్రం అధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. అక్కడే ఈ సినిమా షూట్ చేయడానికి గల కారణాన్ని చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లో చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్ర కథ మూడో శతాబ్ద కాలం నాటిదని చెప్పింది. ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్‌లో చిత్రీకరణను చేపట్టామని స్పష్టం చేసింది. అలా ప్రతి సోమవారం సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ఇస్తుంది. నేడు ప్రభాస్ లుక్‌ను రివీల్ చేసింది.
నిజానికి కొద్ది రోజుల క్రితం ప్రభాస్ కళ్లను చూపించి హైప్ క్రియేట్ చేసింది కన్నప్ప టీమ్. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు ఎంతో వెయిట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. సూపర్బ్‌గా ఉందని, సినిమా కోసం వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు.ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్న మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక రుద్రుడిగా ప్రభాస్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవల్.
ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రను అందరికీ పరిచయం చేశారు. ప్రభాస్ వేషధారణ, లుక్ చూస్తుంటే దైవత్వం ఉట్టి పడేలా కనిపిస్తోంది. అసలు ఈ రేంజ్ లుక్ ఉంటదని డార్లింగ్ ఫ్యాన్స్ సైతం ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్.. ఈ దెబ్బతో తారా స్థాయికి వెళ్లిపోయాయి. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు. పరచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్ బుర్ర, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. విజువల్స్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ ఈ సినిమాను హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారట.
ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కాబోతుంది. మహాభారతం టెలివిజన్ షోకు దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. నిన్న రిలీజైన టీజర్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది.
దుర్మార్గులు, పరాక్రమవంతులైన 50 మంది శత్రు సైన్యాన్ని ఒంటి చేత్తో మట్టుకరిపించిన మహా యోధుడిగా టీజర్లో మంచు విష్ణు ఎలివేషన్ నెక్స్ట్ లెవల్ అసలు. ఒక్క మంచు విష్ణు అనే కాదు.. టీజర్లో కనిపించిన ప్రతీ క్యారెక్టర్, ప్రతీ ఫ్రేమ్ ఎక్స్ట్రార్డినరీగా చూపించారు.అడవి దొరగా మోహన్‌లాల్, శరత్ కుమార్‌లు.. అలాగే కాజల్ అగర్వాల్ హాఫ్ ఫేస్‌ను కూడా టీజర్లో చూపించారు. ఇక హీరోయిన్ ప్రీతి ముకుందన్ శత్రువులతో పోరాటాలు కూడా ఒళ్లుగగుర్పొరిచేలా ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించాడు. ఇక మోహన్ బాబు సైతం ఈ సినిమాలో ఓ రోల్ చేశాడు. మొత్తానికి టీజర్‌తో కన్నప్ప సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
‘ఆ ఇన్‌స్టా పోస్ట్‌లు షేర్ చేసేది ప్రభాస్ కాదు’ – అసలు సీక్రెట్ రివీల్ చేసిన ‘సలార్’ స్టార్!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు బయటనే కాకుండా సోషల్ మీడియాలోనూ కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తను మాత్రం తన లైఫ్‌స్టైల్ గురించి నెట్టింట రేర్‌గానే పంచుకుంటుంటారు. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే అప్డేట్లు ఇస్తూ కనిపిస్తారు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ గురించి ఓ సీక్రెట్‌ను మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రివీల్ చేశారు. అంతేకాకుండా ఆయన ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
“పెద్ద స్టార్ అయినా సరే ప్రభాస్ ఎంతో సింపుల్‌గా ఉంటారు. స్టార్డమ్ గురించి తను అసలు ఆలోచించరు. సోషల్ మీడియాపై కూడా తనకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చే పోస్ట్‌లు షేర్ చేసేది కూడా ఆయన కాదు. ఈ మాట చెప్పి నేను మిమల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. ఆయనకు చిన్న చిన్న ఆనందాలంటేనే ఇష్టం. ఫామ్‌హౌస్‌లో తను ఎంతో సంతోషంగా ఉంటారు. ఎక్కడైనా సరే మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అంటుంటారు. అంత పెద్ద స్టార్ అయినా సరే ఇలా చిన్న ఆనందాలను కోరుకోవటాన్ని నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతాను” అని పృథ్వీ రాజ్ అన్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో దిగ్గజ డైరెక్టర్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు పృథ్వీరాజ్. ‘బాహుబలి’ తర్వాతనే హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం ప్రారంభించారని ఆయన తెలిపారు. “బాహుబలి’కి ముందు ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చినప్పటికీ ‘బాహుబలి 2’ రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో పార్ట్2లపై ఆసక్తి ఎక్కువైంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ కూడా సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే ‘సలార్ 2’ కూడా రానుంది” అని చెప్పారు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ ‘లూసిఫర్ 2 :ఎంపురాన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆదరించిన ‘లూసిఫర్’ ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘లూసిఫర్ 2: ఎంపురాన్ పేరిట ప్రీక్వెల్ కమ్ సీక్వెల్‌ను రూపొందించారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రభాస్ ‘రుద్ర’ లుక్‌పై దారుణమైన ట్రోల్స్.. ‘విష్ణయ్యా.. ఇదేందయ్యా’..!
“ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు..” అంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని కన్నప్ప మూవీ టీమ్ తాజాగా రీలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ పోస్టర్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా నేడు కన్నప్పలో ప్రభాస్ లుక్ చూసి అంతా కంగుతిన్నారు. ఫ్యాన్స్ మాట పక్కన పెడతే కామన్ ఆడియన్స్ అయితే ప్రభాస్ లుక్‌పై విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.
కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారని తెలియగానే అందరూ శివుడి పాత్ర చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు. కానీ శివుడి పాత్రకి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రాగానే ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనే డౌటానుమానం వచ్చింది. అయితే ప్రభాస్ శివుడిగా కాదు నందీశ్వరుడిగా కనిపించబోతున్నారనే టాక్ నడిచింది. కానీ నేడు రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ పాత్ర పేరు ‘రుద్ర’ అని.. శివాజ్ఞ పరిపాలకుడని ఉంది.
నిజానికి శివాజ్ఞ పరిపాలకుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది నందీశ్వరుడే. అయితే పురాణాల్లో శివుడికి ఉన్న మరో పేరు రుద్రుడు. కానీ రుద్రుడు-శివుడు ఇద్దరికీ కాస్త తేడా ఉంది. పురాణాలు బాగా తెలిసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే శివుడి కంటే శక్తివంతుడు రుద్రుడు. మరి ఆ రుద్రుడి పాత్రనే ప్రభాస్ పోషిస్తున్నారా లేక నందీశ్వరుడి క్యారెక్టర్యేనా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రభాస్ లుక్‌పై మాత్రం ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. కొంతమంది అయితే ప్రభాస్ లుక్ చూసి దేశముదురు సినిమాలో కమెడియన్ ఆలీ గెటప్‌లా ఉందంటున్నారు. మరికొంతమంది అయితే బాహుబలిలో తనికెళ్ల భరణిలా ఉందని, ఆదిపురుష్‌లో ప్రభాస్‌లా ఉందని ఇష్టమొచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే ప్రభాస్ లుక్ అంటూ కన్నప్ప టీమ్ వదిలిన దానికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. మరి ఈ విషయంలో మంచు విష్ణు ఎంతవరకూ కేర్ తీసుకున్నారో తెలీదు కానీ ఈ ట్రోల్స్‌లో కొంతవరకూ వాస్తవం అయితే ఉందని ఫ్యాన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ రేంజ్‌కి అందుకు తగ్గట్లు సరిపడే లుక్ ఇవ్వలేకపోయారంటూ ఆరోపిస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ మాట పక్కన పెడితే సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తారోనని భయపడుతున్నారు. కన్నప్ప చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్ బాబు, కాజల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది.
also read-
Daayre-ఇదెక్కడి సినిమారా బాబు..! చెల్లితో పెళ్లి అక్కతో శోభనం.. ఈ రొమాంటిక్ మూవీ ఎక్కడ చూడచ్చంటే…!