MLC Kavitha : కవిత బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు…కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమెకు మధ్యంతర బెయిల్‌ను నిరాకరించగా..ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించారు. ఏప్రిల్ 23 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. దాంతో అప్పటి వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు…కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.
తన చిన్న కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని బెయిల్ ఇవ్వొద్దని ఈడీ పేర్కొంది. దీంతో కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 15న కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో.. ఆమెను కోర్టులో హాజరపరచనున్నారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు.
మరోవైపు కవితను ప్రశ్నించేందుకు ఇప్పటికే కోర్టు అనుమతిని సీబీఐ పొందింది. ఆ విచారణకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై ఈనెల 10న కోర్టు విచారణ జరపనుంది. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై ఈనెల 20న విచారణ జరగనుంది.
also read-Samantha : అఖిల్ బర్త్ డే… మర్చిపోకుండా విష్ చేసిన మాజీ వదిన..?