Sai Pallavi : సినిమా ఇండస్ట్రీకి ఒక రోజులో చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తారు.ఎంత తొందరగా ఇండస్ట్రీకి వస్తారు, వాళ్ళు అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.
Sai Pallavi : ఒక 100 మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తే అందులో ఒకరో, ఇద్దరో మాత్రమే ఇక్కడ హీరోయిన్స్ గా నిలబడుతారు.అందులో చాలామంది హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ అవకాశాలను అందుకున్నవారే కావడం విశేషం.
కానీ సాయి పల్లవి( Sai Pallavi ) మాత్రం ఎలాంటి గ్లామర్ షో చేయకుండా మంచి పాత్రలను ఎంచుకుంటూ నటన లో వైవిధ్యాన్ని కనబరుస్తూనే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు రోల్ మోడల్ గా మారింది.
హీరోయిన్స్ అంటే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఎక్స్ పోజింగ్ చేస్తూ నటిస్తూ ఉంటారని చాలామంది అపోహ పడుతుంటారు.కానీ సాయి పల్లవి లాంటి మంచి నటీమణులు మాత్రం వాళ్లకు కావాల్సిన క్యారెక్టర్లను ఎంచుకొని మరి సినిమాల్లో నటిస్తూ ఉంటారు.అందుకే ఆమె మిగతా హీరోయిన్ల కంటే చాలా సపరేట్ గా కనిపిస్తుంది.
అందుకే ఆమె ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే చాలామంది హీరోయిన్లు ( Heroines ) మంచి పాత్రలను ఎంచుకొని అందులో వైవిధ్యాన్ని కనపరచాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఏ క్యారెక్టర్ లో పడితే ఆ క్యారెక్టర్లో నటించి ఆమెకున్న మంచి పేరుని చెడగొట్టుకోదు ఆమెను వెతుక్కుంటూ క్యారెక్టర్లు వస్తాయి.అలాంటప్పుడు ఆమె నచ్చిన క్యారెక్టర్ ని మాత్రమే ఎంచుకొని సినిమాలు చేయాలనే ఒక రూల్ పెట్టుకుంది.అదే రూల్ లో ముందుకు సాగుతుంది.
also read-వరుణ్ తేజ్ అసలు పేరు ఏంటో తెలుసా.. ఆధార్ కార్డులో అలా ఉందా..?