Samantha: నాగచైతన్య, శోభిత దూళిపాల పెళ్లి పనులు ఈమధ్య పసుపు దంచే కార్యక్రమంతో ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలను శోభిత తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలో.. వీరిద్దరు పెళ్లి నవంబర్ నెలలో అనగా కార్తీకమాసంలో.. ఉంటుందని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరి పెళ్లి పత్రిక సమంతకు కూడా చేరబోతోందని వినికిడి.
Samantha: అక్కినేని నాగచైతన్య , సమంత నుంచి విడిపోయిన తర్వాత మరుసటి ఏడాది అనగా 2022లో.. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాలతో.. ప్రేమలో పడిన విషయంతెలిసిందే. వాస్తవానికి తెనాలికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో అవకాశాల కోసం వెళ్లి అక్కడే సెటిలైపోయింది. ఇప్పుడు వరుస సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ని కూడా గెలుచుకుంది.
Samantha: ఇక నాగచైతన్యతో ప్రేమలో.. పడిన ఈమె రహస్యంగా చట్టపట్టలేసుకొని తిరిగారు. ఈ విషయంపై అడిగిన ప్రతిసారి కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది అక్కినేని నాగార్జున ఆగస్టు 8వ తేదీన వీరి నిశ్చితార్థాన్ని అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పూర్తి చేశారు. ఈ వివాహానికి అక్కినేని నాగార్జున ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి లక్ష్మీ ఫ్యామిలీ అలాగే శోభిత ధూళిపాల ఫ్యామిలీ కూడా విచ్చేశారు..
ఇక దీంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఒక జాతీయ మీడియా నాగార్జునను ప్రశ్నించగా ఇంకా సమయం పడుతుంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా అప్పుడే నాగచైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది . శోభిత విశాఖపట్నంలోని తన ఇంట్లో గోధుమ రాయి, పసుపు దంచడం లాంటి పనులు మొదలయ్యాయి అని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్… అంచు కలిగిన చీర ధరించి చాలా చూడముచ్చటగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చీరను కాబోయే అత్త, నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి బహుమతిగా పంపించిందని సమాచారం.ఇకపోతే పసుపు దంచడం కార్యక్రమం మొదలుపెట్టారంటే ఇక పెళ్లి పనులు దాదాపు మొదలైనట్టే. ఇక నవంబర్ 8వ తేదీన వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా నాగచైతన్య, శోభితల పెళ్లికి సమంతను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత అంటే ఇక్కడ నాగచైతన్య మాజీ భార్య అనుకోవడం పప్పులో కాలేసినట్టే. సమంత ఎవరో కాదు శోభితకు స్వయానా సోదరి. ఆమెను ప్రత్యేకంగా నాగచైతన్య శోభిత ఇద్దరు దగ్గరుండి మరీ ఈ పెళ్లి వేడుకలకు ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అప్పుడు స్పై ఏజెంట్ గా మారాల్సింది.. చైతూపై సామ్ పరోక్ష కామెంట్స్..!
తాజాగా సమంత.. ఇన్ డైరెక్ట్ గా నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తనకు జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. దానికి సమాధానం గా సమంత చెప్పిన జవాబు.. తప్పకుండా నాగచైతన్య, శోభితపై పంచ్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇన్నేళ్ల కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసి దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోలతో పనిచేసి ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. సమంతకి సినిమాల పరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందో తెలియదు కానీ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆమెకు చాలా ఎదురుదెబ్బలే తగిలాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది.
అయితే ఈ సమస్యలన్నీ కూడా రెండేళ్ల క్రితమే. వీటన్నింటి నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటూ ఉండడంతో మళ్ళీ సమంత పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ బాధ నుంచి సమంత బయటపడేలోపే మరొకవైపు తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సమంత సహా అక్కినేని కుటుంబం మొత్తం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక కష్టం ఏదైనా మరిచిపోవడం అలవాటు చేసుకున్న సమంత తాజాగా తన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి ఈ వెబ్ సిరీస్ స్పై థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిజజీవితంలో కూడా స్పై ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించగా.. ఆమె నేనెప్పుడూ అలా స్పై చేయలేదు. ఒకప్పుడు అలా స్ప్రై చేసి ఉంటే బాగుండేది అంటూ నవ్వుతూ సమాధానం తెలిపింది. దీంతో సమంత, నాగచైతన్య కోసమే ఈ కామెంట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
also read-
Triptii Dimri: పైట జార్చి పరువాలు ఒలకబోస్తున్న తృప్తి డిమ్రి.. ఈ డోస్ మాములుగా లేదుగా..