Sobhita Dhulipala: సమంత తన సోల్‌మేట్ అని చెబుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.
Sobhita Dhulipala:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మిస్ ఇండియాతో కెరీర్ ప్రారంభించి నటిగా ఎదిగారు. ఈ క్రమంలోనే ‘గూఢచారి’, ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘నైట్ మేనేజర్’, ‘పోన్నియన్ సెల్వన్’ వంటి సినిమా/సిరీస్‌లో కీ రోల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలే కాకుండా తాజాగా హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన కెరీర్ గురించి శోభిత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
తొలిసారి చదివిన పుస్తకం
నేను పుట్టింది తెనాలిలో. నాన్న నేవీ ఇంజినీర్‌గా వైజాగ్‌లో పనిచేసేవారు. దీంతో నేనూ అక్కడే పెరిగా. అమ్మ టీచర్. ఇంట్లో కేబుల్ కనెక్ష్షన్కు బదులు లైబ్రరీ ఉండేది. చదవడాన్ని హాబీగా మార్చుకున్న నేను ఊహ తెలిశాక ‘బుడుగు’ అనే పుస్తకం చదివాను. వైజాగ్‌లో ఇంటర్ అయ్యాక ముంబయి వచ్చి డిగ్రీలో చేరా. అప్పుడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయాలని ప్రయత్నించాను. ఈ క్రమంలో రంగు గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. మోడల్‌గా ఆడిషన్స్‌కు వెళ్లే క్రమంలో ఎదురైన కొన్ని సంఘటనలు ఎంతో బాధపెట్టాయి. కానీ అవే తెలియకుండా నాలో పట్టుదలనీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి.
తొలి ఛాన్స్
రోజూ నాతో మాట్లాడే నా స్నేహితులు కొందరు ‘నీ వాయిస్ బాగుంది’ అనేవారు. ఆ మాటలు నాలో ఉత్సాహాన్ని నింపడంతో ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. దాదాపు వంద ఆడిషన్లకు హాజరైయ్యా. అలా ఒకసారి నాకు 2016లో అనురాగ్ కశ్యప్ ‘రామన్ రాఘవ్ 2.0’లో అవకాశం వచ్చింది. అంతేకాదు ఒకప్పుడు నన్ను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ ఐశ్వర్యరాయ్ పక్కన యాడ్‌లో నటించాలనడంతోపాటు, వాళ్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగారు.
హాలీవుడ్ సినిమా
‘గూఢచారి’, ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘నైట్ మేనేజర్’, ‘పోన్నియన్ సెల్వన్’ వంటి సినిమాలు నాకు మంచి గుర్తింపును ఇచ్చాయి. ఈ మధ్య ‘మంకీ మ్యాన్’అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించా. ఇక ‘కల్కి’లో దీపిక పదుకొణెకి డబ్బింగ్ నేనే చెప్పాను. అది ఓ ప్రత్యేక అనుభూతి.

నా సోల్‌మేట్
మా చెల్లి సమంత నా సోల్‌మేట్ . ఈ మధ్యే తనకు పెళ్లైంది. కెరీర్లో బిజీగా ఉండడం వల్ల కుటుంబానికీ, బంధువులకీ దూరంగా ఉన్నా. తన పెళ్లిలో అందర్నీ కలుసుకున్నా. అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న సమంతను చూసినప్పుడు మాత్రం ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. నా జీవితంలోని కొన్ని బెస్ట్ మూమెంట్స్‌లో అదీ ఒకటి.
నా కోరిక అదే
అమ్మా అని పిలిపించుకోవాలన్న కోరిక చిన్నప్పటి నుంచీ ఉంది. మాతృత్వపు మాధుర్యం నాకు అద్భుతంగా అనిపిస్తాయి. ఆ అనుభూతుల్ని నేనూ ఆస్వాదించా లనుకుంటున్నా. కాగా, ఇటీవల యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
శోభిత ధూళిపాళ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా చేసుకున్న శోభిత..

నాగచైతన్యతో సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకొని ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు షాకిచ్చారు. ఇక అలాంటి ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.. ఆ పూర్తి విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం..

శోభిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెకు ఎప్పుడు హీరోయిన్ అవ్వాలనే ఆలోచన లేదని.. ఆర్బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ దగ్గర పని చెయ్యాలనుకుంటు కానీ డిగ్రీలో చేరిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.
డిగ్రీ చదివే సమయంలో ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నట్టు ఆతర్వాతనే ఆమె మోడలింగ్ చెయ్యాలని ప్రయత్నిచ్చినట్టు చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఆమె ఆడిషన్స్ కి వెళ్తే నల్లగా ఉందని ఎంతోమంది విమర్శలు చేసినట్టు చెప్తుంది.

దాదాపు వంద ఆడిషన్లకు హాజరైనట్టు.. చివరికి 2016లో అనురాగ్ కశ్యప్ సినిమా రామన్ రాఘవ్ 2.0 లో అవకాశం వచ్చినట్టు చెప్పింది. ఆ సినిమా తర్వాత తన జీవితం మారిపోయినట్టు శోభిత దూళిపాళ చెప్పుకొచ్చారు.

తనకు గుర్తింపు తెచ్చిన సినిమాల గురించి, వెబ్ సిరీస్ ల గురించి చెప్పిన శోభిత తన చెల్లి సమంత గురించి చెప్పుకొచ్చింది. సమంత ఆమె సోల్ మెట్ అని ఆమెకు ఈ మధ్యే పెళ్లి జరిగినట్టు శోభిత చెప్పుకొచ్చింది.

ఇక ఆమెకు భక్తి ఎక్కువ అని.. వీలున్నప్పుడు గుడికి వెళ్తున్నట్టు.. అలాగే ఆమె వెజిటేరియన్ అని ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు అంటే ఆమెకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.
-శోభితా ధూళిపాళ ఇటీవల కాలంలో తరచుగా ట్రెండింగ్ లో ఉంటున్నారు. నాగచైత్యన్యకు, శోభితా ధూళిపాళకు కొన్ని నెలల క్రితం ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి ఎంగెజ్ మెంట్ ఫోటోలను నాగార్జున తన ఇన్ స్టాలో వేదికగా అభిమానులతో సైతం పంచుకున్నాడు.

ఇదిలా ఉండగా.. శోభితా ధూళిపాళ, నాగచైతన్య కొన్నిరోజులుగా రిలేషన్ లలో ఉన్నారని వార్తలు వచ్చాయి. వీరిద్దరు తరచుగా కలుసుకునే వారని కూడా గతంలో రూమర్స్ వచ్చాయి. మొదట్లో అవేంలేదన్న కూడా.. చివరకు ఎంగెజ్ మెంట్ చేసుకుని అందరికి షాకిచ్చారు.

శోభితా ధూళి పాళ మిస్ ఇండియా పోటీలతో తన జర్నీను స్టార్ట్ చేసింది. అంతేకాకుండా మోడల్ గా రాణిస్తునే.. మరోవైపు మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు, సౌత్ ఇండస్ట్రీలో సైతం పలు సినిమాల్లో నటించింది.

ఇటీవల శోభితా ధూళిపాళ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. సినిమా రంగంలో స్పెషల్ గా అనుకొని రాలేదని,మోడల్ గా చేస్తున్నప్పుడు.. అనుకోకుండా.. మూవీ రంగంలో నటించినట్లు చెప్పుకొచ్చారు. కొంత మంది స్నేహితులు వాయిస్ బాగుందనడంతో.. ఆడిషన్స్ కు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది.

2016 లో అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 లో అవకాశం వచ్చినట్లు చెప్పారు. గూఢచారి, కురుప్, మేజర్, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 లవ్ సితార వంటి సినిమాలలో నటించినట్లు చెప్పారు.దీనితోన పాటు.. మేడిన్ హెవెన్ , ద నైట్ మేనేజన్ వెబ్ సిరిస్ లలో సైతం నటించినట్లు కూడా పేర్కొన్నారు.

మంకీమ్యాన్ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. కల్కీ సినిమాలో దీపిక పదుకొణెకి డబ్బింగ్ చెప్పడం మంచి ఎక్స్ పీరియన్స్ అన్నారు. అదే విధంగా తన చెల్లి సమంతా మంచి సోల్ మెట్ అని చెప్పుకొచ్చారు. ఇటీవల తన పెళ్లి జరిగిందని, అప్పుడు అందరితో ఫుల్ జోష్ గా ఎంజాయ్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు.

వర్క్ బిజి వల్ల ఫ్యామిలీతో ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.తన లైప్ లో ఎంగెజ్మెంట్, పెళ్లి ల గురించి ఎక్కువగా అనుకొలేదని చెప్పారు. అదే విధంగా.. చిన్నప్పటి నుంచి అమ్మకావాలని, అమ్మా.. అని పిలిపించుకోవడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. శోభితా ధూళిపాళ ప్యూర్ వెజిటెరియన్.

తను వంట బాగా చేస్తానని, ఆవకాయ, పులిహోర, దద్దోజనం, ముద్దపప్పు, పచ్చి పులుసు, ముద్ద వంకాయలను ఎంతో బాగా చేస్తానని చెప్పుకొచ్చింది. అయితే.. ఇటీవల చైతు, సమంతా విడాకుల ఘటన రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శోభితా.. సమంతా నా సోల్ మేట్ అనగానే.. చైతు మాజీ భార్య గురించి, శోభితా కామెంట్లు చేసిందని అక్కినేని అభిమానులు పొరపడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఇది కాస్త వార్తలలో నిలిచింది.
-also read:war 2-‘వార్ 2’పై ఎన్టీఆర్ ఫోకస్- షూటింగ్ సెట్స్‌లోకి రీ ఎంట్రీ…!