Yatra 2 Movie Review : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ ‘యాత్ర గతంలో ఘన విజయం సాధించిన సంగతి విదితమే.వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం (2019) విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మళయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది.

Yatra 2 Movie Review : ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో(YS Jagan Mohan Reddy’s Political Journey) మహి వి.రాఘవ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వైఎఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా…జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాత్ర 2. మరి మూవీ (Yatra 2 Movie Review) ఎలా ఉందో చూద్దాం.

Yatra 2 Movie Review
Yatra 2 Movie Review

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం, ప్రజల కష్టల తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి.

Here’s  Sajjala Talk on Movie

 

 

 

Here’s Twitter Review

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కథనంపై దర్శకుడు చాలా శ్రద్ధ పెట్టాడు. ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు కథగా ఎమోషనల్ గా రన్ చేసారు. సినిమాలో జగన్, వైఎస్సార్, చంద్రబాబు.. అంటూ క్యారెక్టర్స్ కి అన్ని ఒరిజినల్ పేర్లే వాడటం గమనార్హం. పార్టీల పేర్లు మాత్రం మార్చారు.వైఎస్సార్ మరణం అప్పుడు రియల్ విజువల్స్, చివర్లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడం కూడా రియల్ విజువల్స్ సినిమాలో చూపించారు.

కథ విషయానికొస్తే..

వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా) ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ సినిమా కథ మొదలవుతుంది. తర్వాత ఏపీ ఎన్నికల్లో గెలవడం, వైఎస్సార్ సీఎం అవ్వడం వంటివి కనిపిస్తాయి. అనంతరం వైఎస్సార్ మరణం, వెంటనే జగన్ ఓదార్పు యాత్ర, హైకమాండ్ ఓదార్పు యాత్రని ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టడం, బై ఎలక్షన్స్ లో గెలవడం, జగన్ పై సిబిఐ దాడులు, జగన్ అరెస్ట్ వంటి అంశాలు సినిమాలో చూపించారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించడం, చంద్రబాబు(మహేష్ మంజ్రేకర్) ముఖ్యమంత్రి అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం, అసెంబ్లీ వాకౌట్ చేసొ పాదయాత్ర చేయడం చూపించారు. చివర్లో 2019 లో జగన్ సీఎం అవ్వడంతో సినిమా ముగుస్తుంది.

వైఎస్ఆర్, జగన్ మధ్య ఉండే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. కొడాలి నాని, ఇతర సన్నివేశాలకు సంబంధించిన సీన్లు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో BGM, జగన్ పాత్రకి ఎలివేషన్స్ లో ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది.పొలిటికల్ సినిమాల్లో జగన్ వ్యతిరేకించే వ్యక్తులను దూషించిన విధంగా కాకుండా చంద్రబాబు క్యారెక్టర్‌ను కూడా డిగ్నిఫైడ్‌గా చూపించడం ప్లస్ పాయింట్ అనిపిస్తుంది.

Yatra 2 Movie Review
Yatra 2 Movie Review

గూస్ బంప్స్ తెప్పించే  డైలాగ్స్

1. ‘జగన్‌ రెడ్డి కడపోడు సార్‌.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్‌

2. ‘ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’

3. ‘నువ్వు మా వైఎస్సార్‌ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు..

4. ‘నేను విన్నాను-నేను ఉన్నాను’

5. ‘నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్‌ కొడుకుని’

6. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’

7. ‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే…పులిని బోనులో పెట్టినా అది పులే’

also read-

The Kerala Story OTT Release Date : ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’- స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?